Telugu Global
NEWS

హైదరాబాద్ లో బీసీసీఐ పాలకమండలి కీలక సమావేశం

భారత టీమ్ మేనేజ్ మెంట్ తో వినోద్ రాయ్ చర్చలు క్రికెటర్లతో భార్యల ప్రయాణానికి అనుమతిపై సమీక్ష భారత క్రికెట్ బోర్డు పాలకమండలితో…. టీమిండియా టీమ్ మేనేజ్ మెంట్ సమావేశానికి…. హైదరాబాద్ లో రంగం సిద్ధమయ్యింది. విండీస్ తో ఆఖరి టెస్టుకు… హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండడంతో… భారత క్రికెట్ ప్రముఖులంతా… హైదరాబాద్ కు తరలి వచ్చారు. దారులన్నీ హైదరాబాద్ కే…. అక్టోబర్ 12 నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ కు….ఇటు టీమిండియా, […]

హైదరాబాద్ లో బీసీసీఐ పాలకమండలి కీలక సమావేశం
X
  • భారత టీమ్ మేనేజ్ మెంట్ తో వినోద్ రాయ్ చర్చలు
  • క్రికెటర్లతో భార్యల ప్రయాణానికి అనుమతిపై సమీక్ష

భారత క్రికెట్ బోర్డు పాలకమండలితో…. టీమిండియా టీమ్ మేనేజ్ మెంట్ సమావేశానికి…. హైదరాబాద్ లో రంగం సిద్ధమయ్యింది. విండీస్ తో ఆఖరి టెస్టుకు… హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండడంతో… భారత క్రికెట్ ప్రముఖులంతా… హైదరాబాద్ కు తరలి వచ్చారు.

దారులన్నీ హైదరాబాద్ కే….

అక్టోబర్ 12 నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ కు….ఇటు టీమిండియా, అటు వెస్టిండీస్ జట్ల సభ్యులతో పాటు…బీసీసీఐ పాలకమండలి సభ్యులు, సెలెక్టర్లు సైతం…హైదరాబాద్ చేరుకొన్నారు.

వెస్టిండీస్ జట్టుతో జరిగే ఐదుమ్యాచ్ ల వన్డే , మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ల మ్యాచ్ లు యధావిధిగా జరుగుతాయని… కాంప్లిమెంటరీ పాస్ లపై ఇబ్బందులు ఎదురైతే… ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేసినట్లు బోర్డు పాలకమండలి చైర్మన్ వినోద్ రాయ్ ప్రకటించారు.

కాంప్లిమెంటరీల కలకలం….

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చే స్టేడియాల సామర్థ్యంలో 10 శాతం కాంప్లిమెంటరీ పాస్ లుగా ఇవ్వాలన్న నిబంధనపై ప్రస్తుతం బీసీసీఐలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇండోర్ వేదికగా జరగాల్సిన వన్డే మ్యాచ్ ను ఇప్పటికే విశాఖకు తరలించడం ద్వారా…. తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమని భారత క్రికెట్ బోర్డు చెప్పకనే చెప్పింది.

ఇక… హైదరాబాద్ వేదికగా… వినోద్ రాయ్ అధ్యక్షతన జరిగే పాలకమండలి , టీమ్ మేనేజ్ మెంట్ సభ్యుల సమావేశంలో… కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ కోచ్ రవిశాస్త్రి పాల్గొని వివిధ అంశాలపై సవివరంగా చర్చించనున్నారు.

కీలక అంశాల పై చర్చ…

బీసీసీఐ మీడియా విధానం, విదేశీ పర్యటనల సమయంలో క్రికెటర్లతో పాటు వారి భార్యలను రెండువారాలు… లేదా పూర్తిస్థాయిలో అనుమతించే అంశమై తుదినిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. టీమిండియా నవంబర్ లో ఆస్ట్రేలియాలో జరిపే పర్యటనతో పాటు… ప్రపంచకప్ పైన విధాన నిర్ణయాలు తీసుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  9 Oct 2018 11:00 AM GMT
Next Story