Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ సినిమా టైటిల్ ఇదేనా!

వినయ విధేయ రామ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరుపైనే హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. బోయపాటి దర్శకత్వంలో చరణ్ చేస్తున్న సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందంటూ కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు నిర్మాత డీవీవీ దానయ్య ఈ టైటిల్ ను సీక్రెట్ గా రిజిస్టర్ కూడా చేయించాడట బోయపాటి, తన గత చిత్రానికి జయ జానకి నాయక అనే టైటిల్ పెట్టాడు. ఆ లెక్కన చూసుకుంటే వినయ విధేయ రామ అనే […]

రామ్ చరణ్ సినిమా టైటిల్ ఇదేనా!
X

వినయ విధేయ రామ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరుపైనే హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. బోయపాటి దర్శకత్వంలో చరణ్ చేస్తున్న సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందంటూ కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు నిర్మాత డీవీవీ దానయ్య ఈ టైటిల్ ను సీక్రెట్ గా రిజిస్టర్ కూడా చేయించాడట

బోయపాటి, తన గత చిత్రానికి జయ జానకి నాయక అనే టైటిల్ పెట్టాడు. ఆ లెక్కన చూసుకుంటే వినయ విధేయ రామ అనే టైటిల్ పై పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టైటిల్ లో క్లాస్, కంటెంట్ లో మాస్ చూపించడం ఈమధ్య కొత్త ట్రెండ్ అయింది. అరవింద సమేత, వీరభోగవసంతరాయలు లాంటి టైటిల్స్ ఇలా పుట్టుకొచ్చినవే.

అయితే మరికొంతమంది మాత్రం వినయ విధేయ రామ టైటిల్ పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. చెర్రీ సినిమాకు ఈ టైటిల్ పెట్టకపోవచ్చని అంటున్నారు. వాళ్లు చెప్పే లాజిక్ మరోలా ఉంది. గతంలో ఇదే సినిమాకు స్టేట్ రౌడీ అనే టైటిల్ చర్చకొచ్చింది. ఆ తర్వాత పవన్ నటించిన తమ్ముడు సినిమా టైటిల్ ను రిపీట్ చేస్తారంటూ మరో గాసిప్ కూడా బయల్దేరింది. ఈ రెండు టైటిల్స్ లో ఒకటి పెడతారంటూ మరో వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఎక్కువమంది వినయ విధేయ రామ అనే టైటిల్ వైపే మొగ్గుచూపుతున్నారు.

First Published:  8 Oct 2018 4:56 PM GMT
Next Story