‘ఛలో’ జోడీ మళ్లీ కలుస్తోంది

ఛలోతో సూపర్ హిట్ కొట్టారు నాగశౌర్య, రష్మిక. నాగశౌర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఛలో. అటు రష్మికకు కూడా టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ దక్కింది. ఈ మూవీ తర్వాత ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయిపోయారు. రష్మిక అయితే ఏకంగా టాలీవుడ్ హ్యాపెనింగ్ స్టార్ అయిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు వీళ్లిద్దరూ కలుస్తున్నారు.

అవును.. ఛలో తర్వాత నాగశౌర్య, రష్మిక కలిసి నటించబోయే సినిమాకు రంగం సిద్ధమైంది. అది కూడా ఏకంగా సుకుమార్ నిర్మాణంలో ఆ సినిమా రాబోతోంది. తన బ్యానర్ పై కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ, శౌర్య-రష్మిక హీరోహీరోయిన్లుగా ఈ సినిమా నిర్మించబోతున్నాడు సుకుమార్.

ప్రస్తుతానికైతే ఇది చర్చల దశలో ఉంది. స్టోరీ డిస్కషన్స్ పూర్తవ్వాల్సి ఉంది. నాగశౌర్య సైడ్ నుంచి ఓకే. రష్మిక కూడా ఓకే అంటే కాంబినేషన్ మరోసారి సెట్ అయినట్టే. ప్రాజెక్టు సెట్ అయిన తర్వాత దర్శకుడు ఎవరనే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తారు. తను తీసిన రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్స్ గా పనిచేసిన వ్యక్తుల్లో ఒకర్ని సుకుమార్ ఇలా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు.