Telugu Global
Cinema & Entertainment

భార్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్నీ చెప్పిన ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఇద్దరూ ఇప్పుడు “అరవింద సమేత” ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన వీళ్ళు ఇంకా కొన్ని ఛానల్స్ తిరుగుతూనే ఉన్నారు. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతి గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ చెప్పాడు. అదేంటి అంటే లక్ష్మి ప్రణతి కి వంట చెయ్యడం రాదూ అని, ఈ విషయం ఎన్టీఆర్ […]

భార్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్నీ చెప్పిన ఎన్టీఆర్
X

జూనియర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఇద్దరూ ఇప్పుడు “అరవింద సమేత” ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన వీళ్ళు ఇంకా కొన్ని ఛానల్స్ తిరుగుతూనే ఉన్నారు. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతి గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ చెప్పాడు.

అదేంటి అంటే లక్ష్మి ప్రణతి కి వంట చెయ్యడం రాదూ అని, ఈ విషయం ఎన్టీఆర్ స్వయంగా తన మాటల్లో చెప్పాలంటే “దేవుడా! ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు నా భార్య గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆమెకు వంట రాదు. ఒకవేళ ఎవరన్నా తిన్నా సరే ఇంట్లోంచి పారిపోవాల్సిందే. మా ఇంట్లో నేనే బాగా వంట చేస్తాను. నాకు అన్ని రకాల వంటలు వచ్చు. మా అమ్మగారు నాకంటే బాగా వంట చేస్తారు. ఇంట్లో ఎప్పుడూ మేమిద్దరమే వండేది.” అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ఒక వేళా ఈ ఇంటర్వ్యూ గాని లక్ష్మి ప్రణతి చూస్తే ఇంటికి వెళ్ళాక ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి అని కొంత మంది ఫన్నిగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే “అరవింద సమేత” ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 11 న రిలీజ్ అవుతుంది.

First Published:  9 Oct 2018 12:08 AM GMT
Next Story