Telugu Global
Cinema & Entertainment

సెకండ్ హాఫ్ దగ్గరే ఆగిపోయిన బన్నీ కథ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” సినిమాతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. ఈ ఫ్లాప్ తో పూర్తిగా డీలా పడిపోయిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. ఇప్పటికే తన తదుపరి సినిమాని విక్రం కే కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా కథ విషయంలో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మ‌రీ ముఖ్యంగా […]

సెకండ్ హాఫ్ దగ్గరే ఆగిపోయిన బన్నీ కథ
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” సినిమాతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. ఈ ఫ్లాప్ తో పూర్తిగా డీలా పడిపోయిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. ఇప్పటికే తన తదుపరి సినిమాని విక్రం కే కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

అయితే ఈ సినిమా కథ విషయంలో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మ‌రీ ముఖ్యంగా సెకండాఫ్ విష‌యంలో బ‌న్నీకి కొన్ని డౌట్లు ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం ఆ డౌట్స్ మీదే విక్రం కే కుమార్ ఉన్నాడ‌ని టాక్‌. విక్ర‌మ్ క‌థెల‌ప్పుడూ కొత్త కోణంలో సాగుతాయి. బ‌న్నీకీ అలాంటి క‌థ‌లు చేయ‌డ‌మే ఇష్టం.

అందుకే ఈ సారి కొంచెం కథ కధనం విషయంలో కూడా బన్ని ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఫస్ట్ హాఫ్ లాక్ అయ్యిపోయింది అని సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా లాక్ అవ్వలేదు అని తెలుస్తుంది. సెకండ్ హాఫ్ కూడా పూర్తీ కాగానే వెంటనే సినిమాని పట్టలేక్కిస్తాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలి అనే కసితో ఉన్నాడు.

First Published:  8 Oct 2018 5:20 PM GMT
Next Story