Telugu Global
NEWS

యూత్ ఒలింపిక్స్ లో భారత్ సరికొత్త చరిత్ర

15 ఏళ్ల భారత లిఫ్టర్ కు బంగారు పతకం వెయిట్ లిఫ్టింగ్ లో భారత గోల్డెన్ బోయ్ జెర్మీ లాల్ రింగా 274కిలోల ఓవరాల్ రికార్డుతో స్వర్ణ పతకం ప్రపంచ యువజన ఒలింపిక్స్ చరిత్రలోనే… భారత్ తొలి బంగారు పతకం నెగ్గి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. అర్జెంటీనా రాజధాని బ్యునోస్ ఏర్స్ వేదికగా జరుగుతున్న 2018 యూత్ ఒలింపిక్స్.. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 62 కిలోల విభాగంలో ఇండియన్ గోల్డెన్ బోయ్, మిజోరం సంచలనం, 15 […]

యూత్ ఒలింపిక్స్ లో భారత్ సరికొత్త చరిత్ర
X
  • 15 ఏళ్ల భారత లిఫ్టర్ కు బంగారు పతకం
  • వెయిట్ లిఫ్టింగ్ లో భారత గోల్డెన్ బోయ్ జెర్మీ లాల్ రింగా
  • 274కిలోల ఓవరాల్ రికార్డుతో స్వర్ణ పతకం

ప్రపంచ యువజన ఒలింపిక్స్ చరిత్రలోనే… భారత్ తొలి బంగారు పతకం నెగ్గి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.

అర్జెంటీనా రాజధాని బ్యునోస్ ఏర్స్ వేదికగా జరుగుతున్న 2018 యూత్ ఒలింపిక్స్.. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 62 కిలోల విభాగంలో ఇండియన్ గోల్డెన్ బోయ్, మిజోరం సంచలనం, 15 ఏళ్ల జెర్మీ లాల్ రింగా స్వర్ణపతకం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచాడు.

జెర్మీ మొత్తం 274 కిలోల బరువెత్తి…టర్కీ, కొలంబియా దేశాలకు చెందిన ప్రత్యర్థి లిఫ్టర్లను అధిగమించాడు. ప్రస్తుత యూత్ ఒలింపిక్స్ లో 47 మంది సభ్యుల జట్టుతో పతకాల వేటకు దిగిన భారత్…ఇప్పటికే మూడు రజతాలతో సహా నాలుగు పతకాలు సాధించింది.

షూటింగ్ లో తుషార్ మానే, మేహులీ ఘోష్, మహిళల జూడోలో తబేబీ దేవీ సిల్వర్ మెడల్స్ సాధిస్తే…ఇప్పుడు జెర్మీ లాల్ రింగా బంగారు మోత మోగించాడు.

నాన్ జింగ్ వేదికగా ముగిసిన 2014 యూత్ ఒలింపిక్స్ లో…భారత్ ఒక్కో రజత, కాంస్య పతకాలు మాత్రమే సాధించగలిగింది. సింగపూర్ వేదికగా 2010లో ముగిసిన ప్రారంభ యూత్ ఒలింపిక్స్ లో భారత్ ఆరు రజత, రెండు కాంస్య పతకాలు సాధించింది.

అయితే …ప్రస్తుత ఒలింపిక్స్ లో మాత్రం తొలి బంగారు పతకంతో చరిత్ర సృష్టించింది.

First Published:  9 Oct 2018 3:46 AM GMT
Next Story