Telugu Global
NEWS

టికెట్ వద్దంటున్న అబ్బాయి, బాబాయ్ !

వచ్చే సారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రామ్మోహన్ నాయుడు వెనుకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. తను పోటీలో ఉండనని తన బదులుగా బాధ్యత తీసుకోవాలని తన బాబాయ్ అచ్చెన్నాయుడు మీద ఒత్తిడి చేస్తున్నాడట ఈ యంగ్ ఎంపీ. అయితే అచ్చెన్న కూడా తను పోటీకి సిద్ధంగా లేనని స్పష్టం చేస్తున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా రాజకీయం ఆసక్తిదాయకంగా మారింది. వచ్చేసారి తెలుగుదేశం పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీల్లో చాలా మంది పోటీకి ముందుకు రావడం […]

టికెట్ వద్దంటున్న అబ్బాయి, బాబాయ్ !
X

వచ్చే సారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రామ్మోహన్ నాయుడు వెనుకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. తను పోటీలో ఉండనని తన బదులుగా బాధ్యత తీసుకోవాలని తన బాబాయ్ అచ్చెన్నాయుడు మీద ఒత్తిడి చేస్తున్నాడట ఈ యంగ్ ఎంపీ. అయితే అచ్చెన్న కూడా తను పోటీకి సిద్ధంగా లేనని స్పష్టం చేస్తున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా రాజకీయం ఆసక్తిదాయకంగా మారింది.

వచ్చేసారి తెలుగుదేశం పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీల్లో చాలా మంది పోటీకి ముందుకు రావడం లేదు. ఎంపీగా పోటీ చేస్తే ఆరేడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఖర్చులు పెట్టుకోవాలి. అంతా చేస్తే గెలుస్తామో ఓడతామో తెలియదు. అందులోనూ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఖర్చు పెట్టకుంటే చంద్రబాబు నాయుడు ఫైర్ అవుతాడు. ఇలాంటి నేపథ్యంలో వీరు పోటీకే చేతులు ఎత్తేస్తున్నారని సమాచారం. ఇలాంటి వారిలో రామ్మోహన్ నాయుడు కూడా ఒకరట.

ఈ సారి ఉత్తరాంధ్రలో వైసీపీ పుంజుకునే అవకాశాలున్నాయి. అలాగే పవన్ కల్యాణ్ సపోర్టు కూడా లేదు. ఉత్తరాంధ్రలో పవన్ కూడా అభ్యర్థులను పెట్టేలా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు పోటీకి ససేమిరా అంటున్నాడట. తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని అంటున్నాడట. తన బదులు అచ్చెన్న రంగంలోకి దిగాలని ఈయన కోరుతున్నట్టుగా సమాచారం.

ఇక మంత్రిగా సెటిలైన అచ్చెన్న ఇప్పుడు ఎంపీగా పోటీకి నో అని స్పష్టం చేస్తున్నట్టుగా సమాచారం. తను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ఎంపీగా బరిలోకి దిగనని ఈయన స్పష్టం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వీరిలో చంద్రబాబు నాయుడు ఎవరిని ఒప్పిస్తాడో!

First Published:  10 Oct 2018 12:30 AM GMT
Next Story