కాంగ్రెస్ ఉత్సాహం మీద నీళ్లు చల్లుతున్న సర్వేలు!

తొలి సర్వేలోనేమో… అదిగో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని వార్తలు వచ్చాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని.. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి ఓటమి తప్పదని కొన్ని సర్వేలు స్పష్టం చేశాయి.

ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ జోష్ వచ్చింది. తాము గెలిచేస్తున్నామని ఆ పార్టీ వాళ్లు హ్యాపీ గా ఫీలయ్యారు. అయితే.. ఇప్పుడు మాత్రం కొత్త సర్వేలు వేరే రకం ఫలితాలను ఇస్తున్నాయి.

కాంగ్రెస్ ఖాయంగా గెలవగలిగేది రాజస్థాన్ మాత్రమే అని తాజా సర్వేలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో మాత్రమే కాంగ్రెస్‌కు ఛాన్సుంది.

ఇక మధ్యప్రదేశ్ లో మళ్లీ బీజేపీనే గెలుస్తుందని కొన్ని సర్వేలు అంటున్నాయి. ఛత్తీస్ గడ్ లో పోటాపోటీ వాతావరణం ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కాంగ్రెస్‌కు మింగుడుపడే అంశం కాదు.

ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం. కాంగ్రెస్ పార్టీ ఇంకా దేశంలో ప్రతిపక్షంలో మిగిలిన రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లు కీలకమైనవి.

ఈ సారి గనుక ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవకపోతే…. వచ్చే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాల్లో గెలిస్తే…. రేపు లోక్ సభ ఎన్నికల్లో మినిమం పోటీ ఇవ్వగలదని చెప్పవచ్చు.

అయితే సర్వేలు మాత్రం ఏకగ్రీవంగా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పలేకపోతున్నాయి. కొన్ని సర్వేలు మాత్రమే.. కాంగ్రెస్ హవా ఉందని అంటున్నాయి. మిగతావి అంత లేదు… మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఛాన్సే లేదు, చత్తీస్ గడ్‌లో ఉన్న ఛాన్స్ లు అంతంతమాత్రమే అంటున్నాయి.

రాజస్థాన్ లో మాత్రం కాంగ్రెస్ కు భరోసాని ఇస్తున్నాయి సర్వేలు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందని ఇప్పటి వరకూ వచ్చిన అన్ని సర్వేలూ ఏకగ్రీవంగా చెబుతున్నాయి. ఒక రాష్ట్రంలో పుంజుకుంటే సరిపోతుందా?