Telugu Global
International

భారత్‌లో పన్నుల విధానం అస్తవ్యస్తం..... ధనికుల నుంచి పన్నులు రాబట్టడంలో విఫలం

ప్రజల మధ్య అసమానతలు తగ్గించడంలో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 157 దేశాల్లో సర్వే చేస్తే చివరి నుంచి పదో స్థానంలో అంటే 147వ స్థానంలో భారత్ నిలిచి పరువు తీసింది. బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత ‘ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ’ తాజాగా విడుదల చేసిన ఈ సూచీ భారత్ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వివరించింది. అసమానతలు రూపుమాపడంలో మన దేశం తగిన స్థాయిలో కృషిచేయడం లేదంటూ ఆక్స్ ఫామ్ ఆడిపోసుకుంది. […]

భారత్‌లో పన్నుల విధానం అస్తవ్యస్తం..... ధనికుల నుంచి పన్నులు రాబట్టడంలో విఫలం
X

ప్రజల మధ్య అసమానతలు తగ్గించడంలో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 157 దేశాల్లో సర్వే చేస్తే చివరి నుంచి పదో స్థానంలో అంటే 147వ స్థానంలో భారత్ నిలిచి పరువు తీసింది. బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత ‘ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ’ తాజాగా విడుదల చేసిన ఈ సూచీ భారత్ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వివరించింది.

అసమానతలు రూపుమాపడంలో మన దేశం తగిన స్థాయిలో కృషిచేయడం లేదంటూ ఆక్స్ ఫామ్ ఆడిపోసుకుంది. విద్యా, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ వ్యయం చాలా తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. పరిస్థితులను సత్వరం మెరుగుపర్చాలని స్పష్టం చేసింది. భారతదేశంలో అసమానతలు తగ్గిస్తే కనీసం 17 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడుతారని ఆక్స్ ఫామ్ నివేదించింది.

ఆక్స్ ఫామ్ సూచీ ప్రకారం ప్రపంచంలోనే అతి తక్కువ అసమానతలున్న దేశంగా డెన్మార్క్ అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా దేశాల్లో జపాన్ 11 వస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా, నమీబియా, ఉరుగ్వే వంటి దేశాలు జనం మధ్య అంతరాలు తగ్గించడంలో విశేష కృషి చేస్తున్నాయని ఆక్స్ ఫామ్ ప్రశంసించింది. ఈ విషయంలో భారత్, నైజీరియా వంటి దేశాల కృషి మాత్రం దారుణంగా ఉందని వ్యాఖ్యానించింది. దీన్ని బట్టి అతి పేద, అల్లకల్లోల నైజీరియాతో పోల్చి భారత్ ను తీవ్రంగా ఆక్షేపించింది ఆక్స్ ఫామ్ సంస్థ. ఇక ధనిక దేశాల్లో అమెరికా అసమానతలు తగ్గించడంలో ఏమాత్రం చిత్తశుద్ధి చూపించడం లేదని తెలిపింది.

భారత్ పన్నుల విధానం అస్తవ్యస్తంగా ఉందని ఆక్స్ ఫామ్ విశ్లేషించింది. ధనికుల నుంచి పన్నులు రాబట్టడంలో విఫలమవుతోందని స్పష్టం చేసింది. భారత్ లో కార్మిక హక్కులు సక్రమంగా అమలు కావడం లేదని…. పని ప్రదేశాల్లో మహిళలకు సరైన గౌరవం లభించడం లేదని అభిప్రాయపడింది.

First Published:  10 Oct 2018 1:19 AM GMT
Next Story