విజయ్ ఫ్లాప్ ని ఎంజాయ్ చేస్తున్న ఆ హీరో ఎవరు ?

విజయ్ దేవరకొండ’కి “నోటా” రూపంలో ఫ్లాప్ తగిలిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ అవ్వగానే విజయ్ దేవరకొండ పైన కూడా కొంతమంది పనిగట్టుకొని విమర్శలు చేసారు. దాంతో బాగా హర్ట్ అయ్యాడు విజయ్ దేవరకొండ,. అందుకు పెద్ద పురాణమే రాసాడు సోషల్ మీడియాలో.

“నోటా” చిత్రం క్రిటిక్స్ కి నచ్చలేదు కానీ తమిళ వాళ్ళకు , జాతీయ మీడియా వాళ్ళకు బాగా నచ్చిందని…. అలాగే నోటా ఫ్లాప్ అయినందుకు కొంతమంది పండగ చేసుకున్నారని ,సంతోష పడ్డారని. ఇంకొంతమంది పండగ చేసుకునే మూడ్ లో ఉన్నారని అటువంటి వాళ్ళు వెంటనే పార్టీ చేసుకోవాలని ఎందుకంటే మళ్ళి గట్టి హిట్ తో నేను బాక్స్ ఆఫీస్ ముందుకి వస్తాని అని హెచ్చరించాడు విజయ్ దేవరకొండ.

ఇదిలా ఉంటేహీరో నిఖిల్ తన ట్విట్టర్ లో కొంత మంది నటులు పొగరు తగ్గించుకొని నడిస్తే మంచిది అంటూ పోస్ట్ చేసాడు. నిఖిల్ ఈ మాటలని విజయ్ దేవరకొండని ద్రుష్టిలో పెట్టుకొని అనుంటాడు అని ఫిలిం నగర్ జనాలు మాట్లాడుకుంటున్నారు.