బస్సును నడిపిన కోతి

కర్నాటక ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సును ఓ కోతి నడపుతున్న దృశ్యం సామాజిక మాధ్యమాలలో అలజడి రేపింది. బస్సు డ్రైవర్ క్లచ్, బ్రేకులు, అక్సిలేటర్ ఉపయోగిస్తుంటే కోతి స్టీరింగ్ తిప్పింది.

ఒక నిముషం 13 సెకన్ల నిడివి ఉన్న వీడియో కలకలం రేపింది. ఈ వీడియో తీస్తున్నంత సేపు డ్రైవర్ హాయిగా నవ్వుతూ కనిపించారు. కర్నాటకలోని దావణగేరీలో ఈ సంఘటన జరిగింది. కర్నాటక రోడ్డు రవాణా సంస్థ ఆ డ్రైవర్ ను విధుల నుంచి తప్పించింది.