పూజ హెగ్డే  బాడీగార్డ్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ నటించిన “అరవింద సమేత వీర రాఘవ” సినిమా పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కథ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే ఈ సినిమాలో వీర రాఘవుడిగా నటిస్తున్న ఎన్టీఆర్ లక్ష్యం పూజ హెగ్డే ని కాపాడటమే.

పూజ హెగ్డేకి రాయ‌ల‌సీమ మీద డాక్యుమెంటరీ తీయాలి అనేది కోరిక… కానీ రాయ‌ల‌సీమలో పూజ కి ప్రమాదం పొంచి ఉంటుంది. అనుకోకుండా పరిచయం అయిన వీర రాఘవ ధైర్యం నచ్చి అరవింద తల్లి తండ్రులు అతడితో అరవింద ని రాయ‌ల‌సీమకి పంపిస్తారట.

ఇక అక్కడ నుంచి ఎన్టీఆర్ పూజ ని ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమా. చాలా కాలం త‌ర‌వాత సునీల్ ఈ సినిమాలో హాస్య న‌టుడిగా క‌నిపించ‌బోతున్నాడు. ఇందులో సునీల్ పాత్ర కూడా చాలా కీలకం. సునీల్ ఓ గ్యారేజీ న‌డుపుకుంటుండాడ‌ని, అదే గ్యారేజీలో ఎన్టీఆర్ కూడా చేరి సునీల్‌కి చేదోడు వాదోడుగా ఉంటాడ‌ని, ఎన్టీఆర్ ఇచ్చిన స‌ల‌హాల వ‌ల్లే గ్యారేజ్‌ని పైకి తీసుకొస్తాడ‌ని తెలుస్తోంది.