Telugu Global
Cinema & Entertainment

షూటింగ్ స్పాట్ లో రష్మిక ని ఏడిపించారట

రష్మిక… ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువత మొత్తం కలవరిస్తున్న పేరు ఇది. వరుస సినిమాలు  చేస్తూ వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది రష్మిక. రష్మిక ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో సెటిల్ అయిపొయింది. ఈ నేపధ్యంలో ఇటివలే మీడియా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన రష్మిక “గీత గోవిందం” షూట్ సమయం లో జరిగిన ఒక ఫన్ని ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చింది. “గీత గోవిందం” క్లైమాక్స్ షూట్ జరుగుతుంటే రష్మిక ఆ షూట్ కి లేట్ గా […]

షూటింగ్ స్పాట్ లో రష్మిక ని ఏడిపించారట
X

రష్మిక… ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువత మొత్తం కలవరిస్తున్న పేరు ఇది. వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది రష్మిక. రష్మిక ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో సెటిల్ అయిపొయింది.

ఈ నేపధ్యంలో ఇటివలే మీడియా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన రష్మిక “గీత గోవిందం” షూట్ సమయం లో జరిగిన ఒక ఫన్ని ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చింది. “గీత గోవిందం” క్లైమాక్స్ షూట్ జరుగుతుంటే రష్మిక ఆ షూట్ కి లేట్ గా వెళ్ళిందట. బేసిక్ గా రష్మికతో ఎవరైనా నవ్వుతు మాట్లాడకపోతే చాలా ఇబ్బంది పడిపోతుంది. ఆరోజు షూటింగ్ స్పాట్ కు కొంచెం లేట్ గా వెళ్ళడంతో సెట్ లో ఎవరు తనతో మాట్లాడలేదట. తను పలకరించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దాంతో రష్మిక ఓ చోట కుర్చుని ఫుల్ గా ఏడుస్తుంటే దర్శకుడు పరుశురం అక్కడకు పరుగెత్తుకొచ్చి నిన్ను ఆటపట్టించడానికే ఇదంతా చేశాం అంటూ ఓదార్చాడట డైరెక్టర్.

First Published:  10 Oct 2018 12:59 AM GMT
Next Story