లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయనంటున్న సమంతా

అక్కినేని సమంతా తన కెరీర్ లో తొలిసారి ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. అదే “యు టర్న్”. ఈ సినిమా వినాయక చవితి సంధర్బంగా రిలీజ్ అయ్యి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ మాత్రం రాబ‌ట్టలేక‌పోయింది. తెలుగు, త‌మిళ్‌లో స‌మంత‌కి మంచి క్రేజ్ ఉంది. కాబట్టి తెలుగు, త‌మిళంలో రూపొందిన “యు ట‌ర్న్” సినిమా ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌ని స‌మంత చాలా న‌మ్మ‌కం పెట్టుకుంది. అలాగే ఈ సినిమా కథ మీద కూడా సమంతాకి చాలా నమ్మకం ఉంది. కానీ ఆ న‌మ్మ‌కం నిజం కాక‌పోవ‌డంతో బాగా డీలా ప‌డింద‌ట‌.

తెలుగులో లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో అనుష్క స‌క్స‌ెస్ సాధించింది. ఇక త‌మిళ్‌లో అయితే న‌య‌న‌తార లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ వ‌రుస విజ‌యాలు సాధిస్తుంది. వీళ్ల లాగే స‌మంత కూడా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాల‌నుకుంద‌ట‌. కానీ “యు ట‌ర్న్” విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ఇక నుంచి లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయ‌కూడ‌ద‌నే నిర్ణ‌యం తీసుకుంద‌నే టాక్ వినిపిస్తోంది. అసలు ఎవరు లేడీ ఓరియెంటెడ్ కథ తిసుకోనివచ్చిన ఓకే చేసే మూడ్ లో అయితే సమంతా ఉండదు అని తెలుస్తుంది.