Telugu Global
NEWS

బేరంలో భారీ గ్యాప్‌.... పొత్తు లేనట్టేనా?

టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కడుతున్న కూటమి ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. సీట్ల సర్దుబాటుపై పార్టీల మధ్య చాలా గ్యాప్ కనిపిస్తోంది. కూటమిలో ఒక్క టీడీపీ మాత్రమే కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇచ్చినా సరే దాన్ని అంటిపెట్టుకోవాలనుకుంటోంది. మిగిలిన పార్టీలు మాత్రం కాంగ్రెస్‌ను గట్టిగా నిలదీస్తున్నాయి. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ పై గుర్రుగా ఉన్నారు. సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవడంతో కోదండరాం అల్టిమేటం జారీ చేశారు. 48 గంటల్లోగా అంటే […]

బేరంలో భారీ గ్యాప్‌.... పొత్తు లేనట్టేనా?
X

టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కడుతున్న కూటమి ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. సీట్ల సర్దుబాటుపై పార్టీల మధ్య చాలా గ్యాప్ కనిపిస్తోంది. కూటమిలో ఒక్క టీడీపీ మాత్రమే కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇచ్చినా సరే దాన్ని అంటిపెట్టుకోవాలనుకుంటోంది.

మిగిలిన పార్టీలు మాత్రం కాంగ్రెస్‌ను గట్టిగా నిలదీస్తున్నాయి. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ పై గుర్రుగా ఉన్నారు. సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవడంతో కోదండరాం అల్టిమేటం జారీ చేశారు. 48 గంటల్లోగా అంటే గురువారం సాయంత్రానికల్లా తాము కోరిన సీట్ల సంఖ్యపై కాంగ్రెస్‌ ఏదో ఒక నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో టీజేఎస్‌ తరపున అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అయితే కోదండరాం కోరుతున్న సీట్ల సంఖ్య, కాంగ్రెస్ ఇవ్వాలనుకుంటున్న సీట్ల సంఖ్య మధ్య గ్యాప్‌ భారీగా ఉండడంతో ఈ పొత్తు పొడిచేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీజేఎస్ ఏకంగా 19 సీట్లను అడుగుతోంది.

కాంగ్రెస్‌ మాత్రం మూడు సీట్లు ఇవ్వడానికి మాత్రమే సిద్ధంగా ఉంది. మూడు సీట్లు అంటే అవమానించడమేనని కోదండరాం వర్గం అసంతృప్తితో ఉంది. గురువారం సాయంత్రానికి సీట్ల సంఖ్యపై తేల్చని పక్షంలో 21 మందితో టీజేఎస్ తొలి జాబితా విడుదల చేస్తామని కోదండరాం వెల్లడించారు.

ఆ తర్వాత మరో 25 మందితో మరో జాబితాను విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్‌ కూడా టీజేఎస్ ను లైట్ తీసుకున్నట్టు చెబుతున్నారు. ఒక్క టీడీపీతో మాత్రమే పొత్తు ఉంటే చాలన్న ధోరణితో ముందుకెళ్తున్నారు.

First Published:  9 Oct 2018 10:37 PM GMT
Next Story