“అజ్ఞాతవాసి” ఫ్లాప్ పై స్పందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం “అరవింద సమేత” ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఛానల్స్ తిరుగుతూ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో “అజ్ఞాతవాసి” ఫ్లాప్ గురించి అలాగే ఆ సినిమా పై వచ్చిన కొన్ని రూమర్స్ గురించి మాట్లాడాడు త్రివిక్రమ్.

దీని గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ అజ్ఞాతవాసి సినిమాలో ఒక ఫ్రెంచ్ ఫిలిం మేకర్ నా పై మా సినిమా పై కేసు వేసాడు అని, దానికి పరిహారంగా మేము కొంత నగదు చెల్లించాము అనే టాక్ బయట ఉంది… కానీ అసలు అలాంటివి ఏవి జరగలేదు. అలాగే “అజ్ఞాతవాసి” సినిమా ఫ్లాప్ పూర్తిగా నా బాధ్యతే, అందుకే ఆ సినిమాకి నేను ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ప్రొడ్యూసర్ కి ఇచ్చేశాను” అని చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా వస్తున్న “అరవింద సమేత” సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.