Telugu Global
NEWS

టీఆర్ఎస్ సరికొత్త ప్రచార వ్యూహం....

టీఆర్ఎస్ అభ్యర్థులు అంతుచిక్కని ప్రచార వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. పగవాడిని తిట్టడం కంటే మనం చేసిన మంచినే ప్రచారాస్త్రంగా చేయాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఈ కొత్త తరహా వ్యూహంతో జనాలకు చేరువ అవుతున్నారు.. ఇంతకీ ఏంటా వ్యూహం అంటే.. ‘అవ్వా వెయ్యి రూపాయల పింఛన్ తీసుకున్నావా.?’.. ‘తాతా…. కంటి వెలుగులో చూపించుకున్నావా’ ఇలా ఆత్మీయంగా పలకరిస్తూనే పనిలో పనిగా తమ పథకాల గురించి గొప్పగా…. ఘనంగా చెప్పుకుంటున్నారు. విపక్షాలపై […]

టీఆర్ఎస్ సరికొత్త ప్రచార వ్యూహం....
X

టీఆర్ఎస్ అభ్యర్థులు అంతుచిక్కని ప్రచార వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. పగవాడిని తిట్టడం కంటే మనం చేసిన మంచినే ప్రచారాస్త్రంగా చేయాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఈ కొత్త తరహా వ్యూహంతో జనాలకు చేరువ అవుతున్నారు.. ఇంతకీ ఏంటా వ్యూహం అంటే..

‘అవ్వా వెయ్యి రూపాయల పింఛన్ తీసుకున్నావా.?’.. ‘తాతా…. కంటి వెలుగులో చూపించుకున్నావా’ ఇలా ఆత్మీయంగా పలకరిస్తూనే పనిలో పనిగా తమ పథకాల గురించి గొప్పగా…. ఘనంగా చెప్పుకుంటున్నారు. విపక్షాలపై విమర్శల కన్నా చేసిన పనులను చెప్పుకోవడంపైనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కువగా దృష్టిపెడుతున్నారు.

టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందట. గడిచిన సారి ఎన్నికల్లో తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో ఆ సెంటిమెంట్ ను వాడకుండా కేసీఆర్.. తాను ప్రజలకు గెలిస్తే ఏం చేస్తానో చెప్పుకొచ్చాడు. రుణమాఫీ సహా పింఛన్లు, మిషన్ కాకతీయ వంటి పథకాల పేర్లను వల్లెవేశాడు. ఉపాధి కల్పిస్తానని మాట ఇచ్చాడు.

అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం తెలంగాణ ఇచ్చింది… తెచ్చింది తామేనంటూ బీరాలకు పోయి భంగపడింది. గెలిస్తే ఏం చేస్తామన్నది చెప్పకుండా పాత సెంటిమెంట్ ను రగిల్చింది. కానీ ఇది వర్కవుట్ కాలేదు. కేసీఆర్ తాను గెలిస్తే అద్భుతాలు చేస్తామంటూ ఆశచూపి అధికారం కొల్లగొట్టాడు.

ఇప్పుడూ అదే ఫార్ములాను టీఆర్ఎస్ అమలు చేస్తోందట. ఈ మేరకు కేసీఆర్ అభ్యర్థులకంతా చెప్పేశాడట. దేశం గర్వించే తెలంగాణ ప్రభుత్వ పథకాలను మాత్రమే ప్రచారం చేయాలని ప్రతిపక్షాలను తిట్టడం తగ్గించాలని సూచించాడట. అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థులంతా విపక్షాలపై విమర్శలతో సమయం వృథా చేసుకోకుండా…. చేసిన పనులను చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు.

First Published:  10 Oct 2018 12:25 AM GMT
Next Story