ఐశ్వర్య రాజేష్ తో రొమాన్స్ చేయనున్న విజయ్ దేవరకొండ

ఈ ఏడాది “గీత గోవిందం” తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న విజయ్ దేవరకొండ “నోటా” తో ఫ్లాప్ ని కూడా అందుకున్నాడు. హిట్స్ తో పాటు ఫ్లాప్స్ కూడా సహజం అని భావించిన విజయ్ దేవరకొండ మళ్ళి తన తదుపరి సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. విజయ్ ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో “డియర్ కామ్రేడ్” సినిమాలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దసరా నుంచి షూట్ జరుపుకోబోతుంది అంట. అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా తమిళ బ్యూటీ అయిన ఐశ్వర్య రాజేష్ ని తీసుకోనున్నారు మూవీ యూనిట్. ఐశ్వర్య రాజేష్ కి హీరోయిన్ గా తమిళ్ లో మంచి పేరు ఉంది, నటిగా అక్కడ ఆమెకి అభిమానులు ఉన్నారు.

ఇప్పుడు తెలుగు లో విజయ్ దేవరకొండ పక్కన అవకాశం రావడం పట్ల ఆమె ఎంతో హ్యాపీ గా ఫీల్ అవుతుందట. ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మాత్రం రాశి ఖన్నా చేస్తుంది. క్రియేటివ్ కమర్షియల్స్ పై కె.ఎస్ రామారావు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.