Telugu Global
NEWS

బీజేపీ పెద్దలకు చంద్రబాబు మెసేజ్ పంపించారు

ఈ నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు రూ. 5లక్షల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకుని విదేశాలకు తరలించారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీని గెలిపిస్తే ఆ సొమ్మును విదేశాల నుంచి వెనక్కు రప్పించి రాష్ట్ర ఖజానాకు జమ చేస్తామన్నారు. నేరం చేయనప్పుడు ఐటీ దాడులకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు దొంగ కాబట్టే ఐటీని చూసి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఐటీ దాడులు జరిగినప్పుడు అధికారులకు రాష్ట్ర పోలీసులు రక్షణ కల్పించకూడదని […]

బీజేపీ పెద్దలకు చంద్రబాబు మెసేజ్ పంపించారు
X

ఈ నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు రూ. 5లక్షల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకుని విదేశాలకు తరలించారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీని గెలిపిస్తే ఆ సొమ్మును విదేశాల నుంచి వెనక్కు రప్పించి రాష్ట్ర ఖజానాకు జమ చేస్తామన్నారు.

నేరం చేయనప్పుడు ఐటీ దాడులకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు దొంగ కాబట్టే ఐటీని చూసి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

ఐటీ దాడులు జరిగినప్పుడు అధికారులకు రాష్ట్ర పోలీసులు రక్షణ కల్పించకూడదని చంద్రబాబు ఇటీవల కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని…. ఇలాంటి నిర్ణయం చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోలేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అందుబాటులో ఉంచకపోయినంత మాత్రాన దర్యాప్తు సంస్థలు ఆగిపోవని…. అవసరమైతే కేంద్ర బలగాలను తెచ్చుకునే వెసులుబాటు కూడా ఉంటుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయమని…. అందుకే విజయ్ మాల్యాలాగా, నీరవ్‌ మోడీలాగా చంద్రబాబు, అతడి కుటుంబం విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్నారు. కాబట్టి చంద్రబాబు విదేశాలకు పారిపోకుండా నివారించేందుకు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవాలన్నారు.

నాలుగేళ్లపాటు కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ కలిసి ప్రభుత్వాలను నడిపాయని, ఇప్పుడు వారిద్దరూ విడిపోయారంటే నమ్మే పరిస్థితి లేదన్నారు. 2019 ఎన్నికల తర్వాత తిరిగి బీజేపీకే మద్దతు ఇస్తానని కేంద్ర పెద్దలకు చంద్రబాబు ఇప్పటికే మెసేజ్ పంపించారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ మెసేజ్‌ను చంద్రబాబు మిత్రుల ద్వారా బీజేపీ పెద్దలకు పంపించారన్నారు.

దేశంలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని విజయసాయిరెడ్డి విమర్శించారు. తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.

టీడీపీ వ్యతిరేక ఓట్లను చట్టవిరుద్దంగా తొలగిస్తున్నారన్నారు. అలా జరగకుండా అడ్డుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో పోలీసు, రెవెన్యూ శాఖలో టీడీపీకి అనుకూలంగా ఉన్న అధికారులను కీలకమైన స్థానాల్లో నియమిస్తూ…. నిజాయితీగా ఉండే అధికారులను ప్రాధాన్యత లేని పోస్టులకు పంపుతున్నారని…. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు గత ఎన్నికల్లో 15 నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపిస్తే అందుకు ప్రతిఫలంగా జిల్లాకు ఈ నాలుగున్నరేళ్లలో రౌడీయిజాన్ని, ఇసుక మాఫియాను టీడీపీ ఇచ్చిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు ఏం చేశారో ద్వారకా తిరుమల ఆలయం సాక్షిగా చంద్రబాబు ప్రమాణం చేసి చెప్పాలన్నారు.

First Published:  10 Oct 2018 5:00 AM GMT
Next Story