అఖిల్ సినిమా ఈ ఏడాది లేనట్టే

ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అక్కినేని అఖిల్. ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ చేశారు. మిస్టర్ మజ్ను అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అంతా రెడీ. కానీ సినిమా పోస్ట్ పోన్ అయింది.

అవును.. ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలవుతుందనుకున్న మిస్టర్ మజ్ను సినిమా వచ్చే ఏడాదికి వాయిదాపడింది. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది.

వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న అఖిల్, మిస్టర్ మజ్నుతో ఎలాగైనా తొలి సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఎలాంటి రిస్క్ లేని డేట్ కోసం చూస్తున్నాడు. ఈ ఏడాది దాదాపు డిసెంబర్ మూడో వారం వరకు సినిమాల తాకిడి ఉంది. ఇక సంక్రాంతి సినిమాల సందడి ఉండనే ఉంది. అందుకే అందరికంటే ముందు ఫిబ్రవరిని సెలక్ట్ చేసుకున్నాడు అఖిల్. మరీ ముఖ్యంగా ఇది లవ్ ఎంటర్ టైనర్ కాబట్టి, ప్రేమికుల రోజైతే బాగుంటుందని యూనిట్ భావిస్తోంది.