Telugu Global
NEWS

బీజేపీలో చేరిన దామోదర రాజనర్సింహ భార్య....

ముందస్తు ఎన్నికల్లో ఉత్సాహంగా ముందుకెళ్తున్న వేళ కాంగ్రెస్ కు అనుకోని షాక్ తగిలింది. ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంగా కొనసాగిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దామోదర రాజనర్సింహకు ఇది కోలుకోలేని దెబ్బ. ఆయన కుటుంబంలో చీలిక వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి భర్తకు షాకిచ్చింది. ఆమె గురువారం మధ్యాహ్నం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అయితే భర్త దామోదరతో […]

బీజేపీలో చేరిన దామోదర రాజనర్సింహ భార్య....
X

ముందస్తు ఎన్నికల్లో ఉత్సాహంగా ముందుకెళ్తున్న వేళ కాంగ్రెస్ కు అనుకోని షాక్ తగిలింది. ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంగా కొనసాగిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దామోదర రాజనర్సింహకు ఇది కోలుకోలేని దెబ్బ. ఆయన కుటుంబంలో చీలిక వచ్చిందని అర్థం చేసుకోవచ్చు.

దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి భర్తకు షాకిచ్చింది. ఆమె గురువారం మధ్యాహ్నం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అయితే భర్త దామోదరతో తనకు ఎటువంటి విభేదాలు లేవని ఆమె సన్నిహితులు పేర్కొనడం విశేషం. బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగంగా ఇది జరిగిందని అనుమానాలు రేకెత్తుతున్నాయి.

పద్మినీ రెడ్డి

ప్రస్తుతం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా దామోదర రాజనర్సింహా ఉన్నారు. కాంగ్రెస్ లో లీడ్ మెంబర్ గా కొనసాగుతున్నారు. కానీ ఆయన భార్య మాత్రం భర్తతో విభేదించి బీజేపీలో చేరడం.. ఆయనతో పాటు కాంగ్రెస్ కు షాకిచ్చింది.

మోడీ నాయకత్వంపై నమ్మకంతో పద్మినీ రెడ్డి బీజేపీలో చేరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. అయితే ఇప్పటికే దామోదర రాజనర్సింహాపై పోటీచేయడానికి బీజేపీలో చేరారు బాబు మోహన్. మరి ఇప్పుడు ఏకంగా దామోదర భార్య కూడా బీజేపీలో చేరారు. మరి ఆంధోల్ లో భర్త దామోదరపై భార్య పద్మినీ పోటీచేస్తుందా.? లేక మరేసీటు అయినా ఆమె కోరుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర భార్య ఇలా భర్తతోనే విభేదించి బయటకు రావడం రాజకీయంగా సంచలనంగా మారింది. బీజేపీ ఓ కొత్త వ్యూహంతోనే ఇలా చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

రాజకీయంగా తాను కూడా క్రియాశీలకంగా ఉండాలని ఆమె చాలా కాలంగా పనిచేస్తున్నారు. సంగారెడ్డి టికెట్‌ ఆశించారు. కానీ ఆమెకు టికెట్‌ వచ్చే అవకాశం లేకపోవడంతో పద్మినీ రెడ్డి బీజేపీలో చేరినట్టు చెబుతున్నారు. దామోదర రాజనర్సింహ అనుమతితోనే ఆమె బీజేపీలో చేరిందా లేక సొంతంగా నిర్ణయం తీసుకున్నారా అన్న దానిపై కాంగ్రెస్‌ నేతలు ఆరా తీస్తున్నారు.

డిప్యూటీ సీఎం భార్య, ప్రస్తుతం పీసీసీ మెనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న దామోదర రాజనర్సింహ భార్యే పార్టీని వీడి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌ నేతలు కంగుతిన్నారు. ఇది పార్టీని నైతికంగా దెబ్బతీస్తుందని ఆందోళన చెందుతున్నారు. భార్య తమ ప్రత్యర్థి పార్టీలో చేరిన నేపథ్యంలో దామోదర రాజనర్సింహ…. మెనిఫెస్టో కమిటీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది.

తన భార్యే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన నేపథ్యంలో ఈ పరిస్థితిని దామోదర రాజనర్సింహ ఎలా సమర్ధించుకుంటారన్న దానిపైనా చర్చ జరుగుతోంది. మోడీ నాయకత్వంపై పద్మినీ రెడ్డి ఉంచిన నమ్మకాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ నేత మురళీధర్‌ రావు వ్యాఖ్యానించారు.

First Published:  11 Oct 2018 3:52 AM GMT
Next Story