Telugu Global
CRIME

మరో ఫేస్ బుక్ మోసం....

మాయగాళ్లు పొంచి ఉన్నారు. యువతులు ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ధన, మానాలను పొగొట్టుకోవాల్సిందే. ఇప్పుడు మరో ఫేస్ బుక్ మోసం బయటపడింది. అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ చాటింగ్ లో మాటలు కలుపుతూ లైంగికంగా వేధించడంతో పాటు, డబ్బు, నగలను కాజేశాడో కేటుగాడు. లిస్టులో ఏకంగా 500 మంది ఉన్నారంటే, అతని స్కెచ్ అషామాషీదేం కాదు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. కర్నూలు జిల్లా డోన్ కు చెందిన తేజ ఫేస్ బుక్ లో నకిలీ అకౌంట్ […]

మరో ఫేస్ బుక్ మోసం....
X

మాయగాళ్లు పొంచి ఉన్నారు. యువతులు ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ధన, మానాలను పొగొట్టుకోవాల్సిందే. ఇప్పుడు మరో ఫేస్ బుక్ మోసం బయటపడింది. అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ చాటింగ్ లో మాటలు కలుపుతూ లైంగికంగా వేధించడంతో పాటు, డబ్బు, నగలను కాజేశాడో కేటుగాడు. లిస్టులో ఏకంగా 500 మంది ఉన్నారంటే, అతని స్కెచ్ అషామాషీదేం కాదు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

కర్నూలు జిల్లా డోన్ కు చెందిన తేజ ఫేస్ బుక్ లో నకిలీ అకౌంట్ ప్రారంభించాడు. పేరు మార్చుకొని తేజర్షిగా పరిచయం అయ్యాడు. ఇతనిది బట్టతల. విగ్గు పెట్టి కవర్ చేశాడు. మంచి సూటు వేసుకొని ఆకర్షణీయంగా ఫొటోలు దిగి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. చాలామంది అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతూ ఫ్రెండ్ అయిపోయాడు. ఈ క్రమంలో అతని ఫొటో నచ్చి ఏ అమ్మాయైనా లైక్ కొడితే, ఇక తన టాలెంట్ ను బయటకు తీస్తాడు.

లైక్ కొట్టిన అమ్మాయికి మెసేజ్ లు పంపి, తిరిగి రెస్పాండ్ అయ్యే వరకు వేధిస్తాడు. చాటింగ్ చేస్తూనే న్యూడ్ ఫొటోలు పంపి, పరిచయం అయిన అమ్మాయి ఫొటోలను మార్పింగ్ చేసి తన దగ్గర ఉన్నాయని అందరికీ పంపుతానని బెదిరిస్తాడు. ఒరిజినల్ ఫొటోలను తెప్పించుకొని తన దగ్గరకు రప్పించుకుంటాడు. లైంగికంగా లొంగదీసుకుంటాడు. ఆ సమయంలో కొన్ని ఫొటోలను తీసుకొని పక్కన పెట్టుకుంటాడు.

ఇతని వల్ల మోసపోయిన బెంగుళూరుకు చెందిన ఓ యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని బండారం బట్టబయలైంది. విచారించిన పోలీసులకు దిమ్మతిరిగినంత పనైంది. ఇతని ఖాతాలో ఇలా మోసపోయిన వారి సంఖ్య 500 మంది వరకు ఉన్నారట. డైరీలో 200 మంది యువతుల పేర్లు ఉన్నాయి. ప్రతిరోజూ 50 మంది అమ్మాయిలతో ఫోన్ లో మాట్లాడుతున్నట్టు గుర్తించారు.

గతంలోనూ ఓ కేసులో అరెస్టయిన తేజ అలియాస్ తేజర్షి తన మకాంను డోన్ నుంచి మహానందికి మార్చాడు. ఆర్ఎంపీగా కూడా పనిచేశాడు. ప్రస్తుతం ఓ స్కూల్ ను అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. ఈ క్రమంలో తన పాత ఆన్ లైన్ మోసాల వ్యవహారాన్ని బయటకు తీశాడు. అమ్మాయిలను బుట్టలో వేసుకొని 36 తులాల బంగారం, రూ.3లక్షల వరకు కాజేశాడు. హైదరాబాద్, కర్నూలు, నెల్లూరు, పత్తికొండ, బెంగుళూరు తదితర ప్రాంతాల యువతులు ఇతని చేతిలో మోసపోయిన వారిలో ఉన్నారు.

ఇప్పటికైనా యువతులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అమాయకంగా ఫేస్ బుక్, ట్విట్టర్లలో ఫొటోలు ఉంచవద్దని సూచిస్తున్నారు. పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడి మోసపోవద్దని అంటున్నారు.

First Published:  11 Oct 2018 5:35 AM GMT
Next Story