కాంగ్రెస్‌కు నాదెండ్ల రాజీనామా…. జనసేనలోకి

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. జనసేన పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ రోజు సాయంత్రం తిరుపతిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో నాదెండ్ల మనోహర్‌ భేటీ అవుతారు.

ఇప్పటికే తిరుపతికి నాదెండ్ల బయలుదేరారు. పవన్‌ కల్యాణ్ సాయంత్రానికి తిరుపతి చేరుకుంటారు. అక్కడే ఆయన జనసేనలో చేరనున్నారు. 2014 తర్వాత నాడెండ్ల మనోహర్‌ రాజకీయ జీవితంపై పదేపదే చర్చ జరుగుతోంది.

పీసీసీ అధ్యక్షుడిని చేస్తారని అందుకే ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారని ప్రచారం జరిగింది. ఏఐఐసీలోనైనా కీలక బాధ్యతలు అప్పగిస్తే జాతీయ రాజకీయాలకు వెళ్లాలనుకున్నారు. కానీ కాంగ్రెస్‌లో ఆ అవకాశం రాలేదు. వైసీపీతోనూ చర్చలు జరిగాయి. అవేవీ ఫలించకపోవడంతో నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరుతున్నారు. నాదెండ్ల మనోహర్‌ది గుంటూరుజిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆఖరి స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్‌ పనిచేశారు.