నాగ చైతన్య, సమంతాల “మజిలి” స్టార్ట్ అయ్యింది

అక్కినేని నాగ చైతన్య, సమంతలకి పెళ్లి అయ్యి ఏడాది అయిపొయింది. అయితే ఈ సంధర్బంగా వీళ్ళిద్దరూ కలిసి మళ్ళి నటిస్తున్నారు. గతంలో “ఏమాయ చేశావే” “అటో నగర్ సూర్య” “మనం” సినిమాలలో కలసి చేసిన చైతు, సమంత పెళ్లి తర్వాత కలసి నటిస్తున్న సినిమా ఇదే. ఈ సినిమా టైటిల్ “మజిలి” అంటూ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.

“నిన్ను కోరి” ఫేం శివ నిర్వాన ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా దర్శకనిర్మాతలు “మజిలి” టైటిల్ నే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే “మజిలి” టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. ఇక ఈ సినిమాని భార్య భర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా తెరకేక్కిస్తున్నాడు డైరెక్టర్ శివ. హిందీ నటి దివ్యంశ కౌశిక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఎస్. నాగ వంశీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.