Telugu Global
NEWS

పంచాయతీ ఎన్నికల పై హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వాహణ అంశంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురైంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులతో పాలన రాజ్యాంగ విరుద్దమని అభిప్రాయపడింది. మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అప్పటి వరకు స్పెషల్‌ ఆఫీసర్లను కొనసాగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల నిర్వాహణకు షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వాహణ ఎలా సాధ్యమన్న దానిపైనా చర్చ […]

పంచాయతీ ఎన్నికల పై హైకోర్టు సంచలన తీర్పు
X

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వాహణ అంశంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురైంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అధికారులతో పాలన రాజ్యాంగ విరుద్దమని అభిప్రాయపడింది. మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అప్పటి వరకు స్పెషల్‌ ఆఫీసర్లను కొనసాగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల నిర్వాహణకు షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వాహణ ఎలా సాధ్యమన్న దానిపైనా చర్చ జరుగుతోంది.

అయితే డిసెంబర్ 11నాటికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లోగా అంటే జనవరి 11లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. అక్కడ కూడా ప్రత్యేకాధికారులతో పంచాయతీ పాలన సాగిస్తున్నారు. ఒకవేళ ఏపీ విషయంలోనూ కోర్టు ముందుకు పిటిషన్లు వెళ్తే ఇదే తరహా తీర్పు రావొచ్చు.

First Published:  11 Oct 2018 12:31 AM GMT
Next Story