ఒక్క పాట కోసం కోటీ రూపాయలు తీసుకున్న రకుల్

నందమూరి బాలకృష్ణ తాజా నటిస్తున్న సినిమా “ఎన్టీఆర్”. నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ శ్రీ దేవిగా నటిస్తుంది. అయితే ఈ పాత్ర సినిమా మొత్తం ఉండదు. కేవలం ఆకు చాటు పిందే తడిచే సాంగ్ వరకు మాత్రమే రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి డాన్స్ చేసి పోతుందట. అయితే ఈ పాట కోసం రకుల్ ప్రీత్ సింగ్ అక్షరాల కోటీ రూపాయలు పారితోషకం తీసుకుందట.

బాలకృష్ణ దగ్గరుండి మరి రకుల్ కి కోటీ ఇప్పించాడట. అసలు రకుల్ కెరీర్ ని ఒకసారి చూసుకుంటే ఈ భామ చేతిలో ఇప్పుడు పెద్దగ సినిమా ఏవి లేవు, పైగా గత ఏడాది వచ్చిన “స్పైడర్” సినిమాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది రకుల్. కెరీర్ డల్ మోడ్ లో ఉన్నా… కూడా కేవలం ఒక్క పాట కోసం రకుల్ కి కోటీ ఇచ్చారు అంటే గ్రేట్ అనే చెప్పాలి. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి సంధర్బంగా రిలీజ్ కానుంది.