ఆ హీరో కోసం పడిగాపులు కాస్తున్న శ్రీకాంత్ అడ్డాల

“బ్ర‌హ్మోత్స‌వం” సినిమా ఫ్లాప్ తో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ చాలా డల్ అయిపొయింది. ఆ సినిమా ఫ్లాప్ అయిన… ఏడాది తరువాత కూడా శ్రీకాంత్ అడ్డాల బయటకి రాలేదు. ఒక్కడే కూర్చొని తన తదుపరి సినిమాని కథని రాసుకుంటున్నాడట. అయితే ఈ కథని శర్వానంద్ తో చేద్దాం అనుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. కానీ శర్వానంద్ వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందుకే ఈ సినిమా కథని ఇప్పుడు నానికి చెప్పాడు అంట శ్రీకాంత్ అడ్డాల.

నానికి క‌థ న‌చ్చినా ఇప్పుడైతే శ్రీకాంత్ అడ్డాల తో సినిమా చేసే ప‌రిస్థితులో లేడు. ఎందుకంటే “జెర్సీ” కి ఆల్రెడీ డేట్లు స‌ర్దుబాటు చేసేశాడు నాని. అది పూర్త‌యితే గానీ శ్రీ‌కాంత్ సినిమాని ఓకే చేయ‌లేడు. శర్వానంద్ డేట్స్ దొరక్కే శ్రీకాంత్ అడ్డాల నాని దగ్గరకి వచ్చాడు… ఇప్పుడు నాని దగ్గర కూడా డేట్స్ తీసుకోలేని పరిస్థితిలో శ్రీకాంత్ అడ్డాల ఉన్నాడు. మరి నాని శ్రీకాంత్ అడ్డాల మనవి విని డేట్స్ ఇస్తాడో లేదో చూడాలి. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నాడు.