Telugu Global
NEWS

తెలంగాణలో ప్రచారానికి బాలకృష్ణ ?

తెలంగాణ టీడీపీ నేతలు స్టార్ క్యాంపెయినర్ల కోసం వెతుకుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల తాను రాలేనని చంద్రబాబు తెగేసి చెప్పిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. నారా లోకేష్‌తో ప్రచారం చేయించాలని భావించినా ఆయన ప్రచారంపై హామీ రాలేదని చెబుతున్నారు. దీంతో నటుడు బాలకృష్ణను టీటీడీపీ నేతలు ఎల్ రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ సారథి స్టూడియోలో బాలకృష్ణను కలిసిన నేతలు… తెలంగాణలో పార్టీ పరిస్థితిని వివరించారు. […]

తెలంగాణలో ప్రచారానికి బాలకృష్ణ ?
X

తెలంగాణ టీడీపీ నేతలు స్టార్ క్యాంపెయినర్ల కోసం వెతుకుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల తాను రాలేనని చంద్రబాబు తెగేసి చెప్పిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు.

నారా లోకేష్‌తో ప్రచారం చేయించాలని భావించినా ఆయన ప్రచారంపై హామీ రాలేదని చెబుతున్నారు. దీంతో నటుడు బాలకృష్ణను టీటీడీపీ నేతలు ఎల్ రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ సారథి స్టూడియోలో బాలకృష్ణను కలిసిన నేతలు… తెలంగాణలో పార్టీ పరిస్థితిని వివరించారు. చంద్రబాబు ప్రచారానికి వచ్చేందుకు సుముఖంగా లేనందున ప్రచారానికి రావాల్సిందిగా బాలకృష్ణను కోరారు.

తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటున్న నేపథ్యంలో బాలకృష్ణ వస్తే కాంగ్రెస్ తరపున కూడా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే టీడీపీలో తర్జనభర్జన నడుస్తోంది.

తన తండ్రి ఏ పార్టీ ఉనికినైతే ప్రశ్నిస్తూ పార్టీని పెట్టారో ఇప్పుడు అదే పార్టీకి ఓటేయాల్సిందిగా తెలంగాణలో బాలకృష్ణ ప్రచారం చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పోటీ చేసే సీట్లలో ప్రచారం చేయకపోయినా కనీసం పొత్తులో భాగంగా టీడీపీ పోటీ చేసే కొన్ని స్థానాల్లోనైనా ప్రచారం చేయాలని టీటీడీపీ నేతలు బాలకృష్ణను కోరారు.

First Published:  11 Oct 2018 1:32 AM GMT
Next Story