Telugu Global
NEWS

ఉప రాష్ట్రపతి తెలుగుదేశం టికెట్లు కూడా ఇప్పిస్తారా?

నాలుగేళ్లుగా సబ్బంహరి ఎంతగా పొడుగుతున్నా చంద్రబాబు ఇంకా వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. టీడీపీలో చేరమని తలుపులు మాత్రం తీయడం లేదు. అయిన్పటికీ టీడీపీ టికెట్‌పై సబ్బంహరి ధీమాగా ఉండడం వెనుక ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇచ్చిన అభయమే కారణం అని ఆయన అనుచరులు చెబుతున్నారు. టీడీపీ టికెట్‌ ఇస్తానని సబ్బంహరికి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారని అందుకే సబ్బంహరి టీడీపీ పట్ల సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆయన బ్యాంకులకు రుణం ఎగ్గొట్టిన వ్యవహారం బయటకు రావడం, […]

ఉప రాష్ట్రపతి తెలుగుదేశం టికెట్లు కూడా ఇప్పిస్తారా?
X

నాలుగేళ్లుగా సబ్బంహరి ఎంతగా పొడుగుతున్నా చంద్రబాబు ఇంకా వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. టీడీపీలో చేరమని తలుపులు మాత్రం తీయడం లేదు. అయిన్పటికీ టీడీపీ టికెట్‌పై సబ్బంహరి ధీమాగా ఉండడం వెనుక ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇచ్చిన అభయమే కారణం అని ఆయన అనుచరులు చెబుతున్నారు. టీడీపీ టికెట్‌ ఇస్తానని సబ్బంహరికి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారని అందుకే సబ్బంహరి టీడీపీ పట్ల సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు.

ఇదే సమయంలో ఆయన బ్యాంకులకు రుణం ఎగ్గొట్టిన వ్యవహారం బయటకు రావడం, విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు సబ్బంహరి ఆస్తుల వేలానికి నోటీసులు ఇవ్వడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు రుణం తీసుకుని దాన్ని ఆయన తిరిగి చెల్లించలేదు. ఆస్తులు లేవా అంటే బాగానే ఉన్నాయి. బ్యాంక్‌ నుంచి ఈ అప్పు తీసుకుని కూడా ఆస్తులే కొన్నాడు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు టికెట్ ఇవ్వకుండా తప్పించుకునేందుకు ఇదో కారణమవుతుందేమోనని సబ్బంహరి వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకులకు వందల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వారు టీడీపీలో చాలా మందే ఉన్నా వారి సంగతి వేరు సబ్బంహరి సంగతి వేరని లెక్కలేస్తున్నారు. సబ్బంహరి ఇంకా టీడీపీలో చేరలేదు కాబట్టి రుణాల ఎగవేతను కారణంగా చూపి పార్టీలోకి ఆహ్వానించకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు.

టీడీపీ నుంచి టికెట్ సాధించే విషయంలో సబ్బంహరి .. వెంకయ్యనాయుడిపై కొండంత ఆశ పెట్టుకున్నారు. టికెట్ ఇవ్వాల్సిందేనని చంద్రబాబుకు వెంకయ్యనాయుడు సూటిగా చెబితే సబ్బంహరికి నీడ దొరికినట్టు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జగన్‌ను, పవన్‌ను తీవ్రంగా విమర్శించడం ద్వారా అక్కడ తలుపులు మూసుకుపోయాయని… ఇప్పుడు టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా సబ్బంహరి చేసేదేమీ లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.

ఈ బలహీనతను కూడా ఆసరాగా తీసుకుని చంద్రబాబు పావులు కదిపితే సబ్బంహరి రాజకీయ భవిష్యత్తు చిక్కుల్లో పడడం ఖాయమంటున్నారు. అయితే బీజేపీతో టీడీపీ బంధం తెగినప్పటికీ, వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ ఆయన టీడీపీ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారని సబ్బంహరి వర్గీయులు చెబుతుండడం ఆసక్తిగానే ఉంది.

First Published:  10 Oct 2018 11:58 PM GMT
Next Story