Telugu Global
NEWS

ఆసియా ఫుట్ బాల్ లో అరుదైన పోరు

చైనా గడ్డపై  భారత్ తొలిసాకర్ సమరం 21 సంవత్సరాల తర్వాత చైనాతో భారత్ ఫ్రెండ్లీ మ్యాచ్ 76వ ర్యాంకర్ చైనాకు 97వ ర్యాంకర్ భారత్ సవాల్ స్టార్ ఫార్వర్డ్ సునీల్ చెత్రీ నాయకత్వంలోని 22 మంది సభ్యుల భారత ఫుట్ బాల్ జట్టు… తొలిసారిగా డ్రాగన్ ల్యాండ్ చైనాలో అడుగుపెట్టింది. 76వ ర్యాంకర్ చైనాతో ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం…97వ ర్యాంకర్ భారత్ ప్రత్యేకంగా చైనా చేరుకొంది. ఆసియాలోని అత్యుత్తమ సాకర్ జట్లలో చైనా ఒకటని… చైనాతో తలపడటం […]

ఆసియా ఫుట్ బాల్ లో అరుదైన పోరు
X
  • చైనా గడ్డపై భారత్ తొలిసాకర్ సమరం
  • 21 సంవత్సరాల తర్వాత చైనాతో భారత్ ఫ్రెండ్లీ మ్యాచ్
  • 76వ ర్యాంకర్ చైనాకు 97వ ర్యాంకర్ భారత్ సవాల్

స్టార్ ఫార్వర్డ్ సునీల్ చెత్రీ నాయకత్వంలోని 22 మంది సభ్యుల భారత ఫుట్ బాల్ జట్టు… తొలిసారిగా డ్రాగన్ ల్యాండ్ చైనాలో అడుగుపెట్టింది.

76వ ర్యాంకర్ చైనాతో ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం…97వ ర్యాంకర్ భారత్ ప్రత్యేకంగా చైనా చేరుకొంది. ఆసియాలోని అత్యుత్తమ సాకర్ జట్లలో చైనా ఒకటని… చైనాతో తలపడటం ద్వారా తమ సత్తా ఏపాటిదో తెలుసుకొనే అవకాశం ఉంటుందని… భారత కోచ్ స్టీఫెన్ కాన్ స్టాంటిన్ అంటున్నారు.

శనివారం జరిగే తొలి ఫ్రెండ్లీ మ్యాచ్ లో చైనా ను భారత్ ఢీ కొనబోతోంది. వచ్చే ఏడాది జరిగే ఏఎఫ్ సీ కప్ సాకర్ టోర్నీకి సన్నాహాలలో భాగంగా…చైనా లాంటి గట్టి జట్లతో పోటీపడటం తమకు లాభిస్తుందని భారత్ భావిస్తోంది.

చైనాతో ఇప్పటి వరకూ 17 సార్లు తలపడిన భారత ఫుట్ బాల్ జట్టు…ఒక్కసారి నెగ్గలేకపోయింది. చివరిసారిగా…నెహ్రూ గోల్డ్ కప్ టోర్నీలో భాగంగా 1997లో చైనాతో భారత్ పోటీకి దిగింది.

21 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత…ఢీ కొనబోతున్న భారత్, చైనా జట్ల ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. షుజావో సిటీ ఒలింపిక్ సెంటర్ స్టేడియంలో ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించనున్నారు.

ప్రపంచంలోనే జనాభాపరంగా మొదటి రెండు అతిపెద్ద దేశాలుగా ఉన్న చైనా, భారత్….ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో మాత్రం ఎంతగానో వెనుకబడి ఉన్నాయి. కనీసం ఆసియా స్థాయిలోనూ అగ్రశ్రేణిజట్లు కాలేకపోయాయి.

First Published:  12 Oct 2018 1:55 AM GMT
Next Story