Telugu Global
NEWS

95 ఓవర్లు...7 వికెట్లు...295 పరుగులు

హైదరాబాద్ టెస్ట్ తొలిరోజునే విండీస్ పోరాటం తొలిఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 295 పరుగులు విండీస్ టాపార్డర్ ఫ్లాప్, మిడిలార్డర్ హిట్ గాయంతో ప్రారంభమైన శార్ధూల్ టెస్ట్ అరంగేట్రం హైదరాబాద్ టెస్ట్ తొలిరోజు ఆటను….8వ ర్యాంకర్ వెస్టిండీస్ సంతృప్తికరంగా ముగించింది. రాజీవ్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలిరోజు ఆటలో కరీబియన్ టీమ్.. 7 వికెట్లకు 295 పరుగుల సాధించింది. మిడిలార్డర్ ఆటగాడు రోస్టన్ చేజ్ 98, లోయర్ ఆర్డర్ ఆటగాడు బిషు 2 పరుగుల నాటౌట్ […]

95 ఓవర్లు...7 వికెట్లు...295 పరుగులు
X
  • హైదరాబాద్ టెస్ట్ తొలిరోజునే విండీస్ పోరాటం
  • తొలిఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 295 పరుగులు
  • విండీస్ టాపార్డర్ ఫ్లాప్, మిడిలార్డర్ హిట్
  • గాయంతో ప్రారంభమైన శార్ధూల్ టెస్ట్ అరంగేట్రం

హైదరాబాద్ టెస్ట్ తొలిరోజు ఆటను….8వ ర్యాంకర్ వెస్టిండీస్ సంతృప్తికరంగా ముగించింది. రాజీవ్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలిరోజు ఆటలో కరీబియన్ టీమ్.. 7 వికెట్లకు 295 పరుగుల సాధించింది. మిడిలార్డర్ ఆటగాడు రోస్టన్ చేజ్ 98, లోయర్ ఆర్డర్ ఆటగాడు బిషు 2 పరుగుల నాటౌట్ స్కోర్లతో క్రీజులో ఉన్నారు. మొదటి రోజు ఆట హైలైట్స్ ఓసారి చూద్దాం….

విండీస్ ఫైటింగ్ బ్యాటింగ్….

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియాతో….హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రారంభమైన రెండోటెస్ట్ తొలిరోజు ఆటలో… 8వ ర్యాంకర్ వెస్టిండీస్ మెరుగైన ఆటతీరు ప్రదర్శించింది.

రాజ్ కోట వేదికగా గతవారం ముగిసిన తొలిటెస్ట్ మూడు రోజుల్లోనే చిత్తుగా ఓడిన విండీస్ టీమ్…ప్ర స్తుత రెండోటెస్టులో మాత్రం… కీలక టాస్ నెగ్గి… ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం ద్వారా గొప్ప సాహసమే చేసింది.

రెండుజట్లూ ఒక్కమార్పుతో బరిలోకి దిగడంతో ఈమ్యాచ్ ప్రారంభమయ్యింది. గాయం నుంచి కోలుకొన్న కెప్టెన్ జేసన్ హోల్డర్…. విండీస్ తుదిజట్టులో చేరగా… టీమిండియా మాత్రం… సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చి… యువఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ కు టెస్ట్ క్యాప్ ఇచ్చింది.

టాపార్డర్ టపటపా….

బ్రాత్ వెయిట్- పావెల్ ల జోడీతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ మొదటి వికెట్ కు 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. 22 పరుగుల స్కోరుకు పావెల్ ను ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ అవుట్ చేయడంతో… కరీబియన్ వికెట్ల పతనం ప్రారంభమయ్యింది.

మరో ఓపెనర్ బ్రాత్ వెయిట్ 14, హెట్ మేయర్ 12 పరుగులకు…చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో దొరికిపోడంతో… లంచ్ విరామానికి…విండీస్ జట్టు 3 వికెట్లకు 86 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భోజన విరామం తర్వాత… వన్ డౌన్ ఆటగాడు హోప్ 36 పరుగులకు అవుట్ కావడంతో…విండీస్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. 113 పరుగుల వద్ద యాంబ్రిస్ సైతం వెనుదిరగడంతో.. కరీబియన్ టీమ్ ఐదో వికెట్ నష్టపోయి …ఎదురీత మొదలు పెట్టింది.

హోల్డర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ….

అయితే…మిడిలార్డర్ ఆటగాళ్లు రోస్టన్ చేజ్, డార్విచ్ 6వ వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో పరిస్థితి చక్కదిద్దారు.

డార్విచ్ 30 పరుగులకు అవుట్ కావడంతో… క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హోల్డర్… అండగా నిలవడంతో… చేజ్ తన బ్యాటింగ్ జోరును కొనసాగించాడు.

ఈ ఇద్దరూ ఏడో వికెట్ కు కీలక భాగస్వామ్యంతో… భారత బౌలర్ల జోరుకు అడ్డుకట్ట వేయగలిగారు. చేజ్ 80 బాల్స్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేస్తే…. హోల్డర్ 86 బాల్స్ లో 6 బౌండ్రీలతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి… ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో… కీపర్ రిషభ్ పంత్ పట్టిన క్యాచ్ కు అవుటయ్యాడు.

చేజ్ ఎదురుదాడి….

చేజ్…174 బాల్స్ లో 7 బౌండ్రీలు, ఒక సిక్సర్ తో 98 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలవడంతో…విండీస్ 95 ఓవర్లలో 7 వికెట్లకు 295 పరుగులతో తొలిరోజుఆటను ముగించింది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్ చెరో మూడు వికెట్లు, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.

టెస్ట్ అరంగేట్రం చేసిన శార్దూల్ ఠాకూర్ ..పది బంతులకే కాలిమడమ గాయంతో…డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. గతవారం ముగిసిన రాజ్ కోట టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో 48 ఓవర్లలో కేవలం 181 పరుగులకే కుప్పకూలిన కరీబియన్ టీమ్…హైదరాబాద్ టెస్టు తొలిరోజు ఆటలో 95 ఓవర్లు ఎదుర్కొని…7 వికెట్లకు 295 పరుగుల స్కోరు సాధించడం ద్వారా… విమర్శకులకు తగిన జవాబు ఇవ్వగలిగింది.

First Published:  12 Oct 2018 12:05 PM GMT
Next Story