Telugu Global
NEWS

హైదరాబాద్ టెస్టులో పాపం! శార్థూల్ ఠాకూర్

టెస్ట్ క్యాప్ అందుకొన్న ఆనందం తొలిరోజునే ఆవిరి భారత 294వ టెస్ట్ క్రికెటర్ గా శార్ధూల్ రెండో ఓవర్ కే కాలిమడమగాయంతో శార్దూల్ రిటైర్డ్ హర్ట్ భారత టెస్ట్ జట్టులో చోటు సంపాదించాలన్న ..ముంబై యువఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా విండీస్ తో ప్రారంభమైన రెండోటెస్టు బరిలోకి దిగిన భారత తుదిజట్టులో శార్థూల్ కు చోటు దక్కింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చి…శార్థూల్ కు […]

హైదరాబాద్ టెస్టులో పాపం! శార్థూల్ ఠాకూర్
X
  • టెస్ట్ క్యాప్ అందుకొన్న ఆనందం తొలిరోజునే ఆవిరి
  • భారత 294వ టెస్ట్ క్రికెటర్ గా శార్ధూల్
  • రెండో ఓవర్ కే కాలిమడమగాయంతో శార్దూల్ రిటైర్డ్ హర్ట్

భారత టెస్ట్ జట్టులో చోటు సంపాదించాలన్న ..ముంబై యువఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది.

హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా విండీస్ తో ప్రారంభమైన రెండోటెస్టు బరిలోకి దిగిన భారత తుదిజట్టులో శార్థూల్ కు చోటు దక్కింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చి…శార్థూల్ కు టెస్ట్ క్యాప్ ఇచ్చారు.

ఎనిమిది దశాబ్దాల భారత టెస్ట్ చరిత్రలో….టెస్ట్ క్యాప్ అందుకొన్న 294వ క్రికెటర్ గా శార్దూల్ ఠాకూర్ రికార్డుల్లో చేరాడు. అయితే…తొలి ఓవర్ ను సజావుగానే బౌల్ చేసిన శార్దూల్ రెండో ఓవర్ నాలుగో బంతికే…కాలిమడమ నొప్పితో…బౌలింగ్ నుంచి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

మొత్తం మీద హైదరాబాద్ టెస్ట్ తొలిరోజు ఆట….శార్ధూల్ ఠాకూర్ కు మిశ్రమ అనుభవాలను మిగిల్చింది.

First Published:  12 Oct 2018 7:00 AM GMT
Next Story