Telugu Global
Cinema & Entertainment

కన్నడ బ్యూటీ ని తెలుగులోకి పరిచయం చేస్తున్న నాని

ఈ ఏడాదిని ఒక ఫ్లాప్ తో స్టార్ట్ చేసిన నాని “దేవదాస్” యావరేజ్ హిట్ తో ఈ ఏడాదిని ముగించడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా తరువాత నాని నటిస్తున్న సినిమా “జెర్సీ”. “మళ్ళి రావా” ఫేం గౌతం తిన్ననూరి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో క్రికెటర్ గా కనిపించనున్న నాని క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. దసరా నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే  ఈ సినిమాతో ఒక కన్నడ బ్యూటీ […]

కన్నడ బ్యూటీ ని తెలుగులోకి పరిచయం చేస్తున్న నాని
X

ఈ ఏడాదిని ఒక ఫ్లాప్ తో స్టార్ట్ చేసిన నాని “దేవదాస్” యావరేజ్ హిట్ తో ఈ ఏడాదిని ముగించడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా తరువాత నాని నటిస్తున్న సినిమా “జెర్సీ”. “మళ్ళి రావా” ఫేం గౌతం తిన్ననూరి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో క్రికెటర్ గా కనిపించనున్న నాని క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. దసరా నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే ఈ సినిమాతో ఒక కన్నడ బ్యూటీ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఆమె శ్రద్ద శ్రీనాధ్. మలయాళం, తమిళం, కన్నడలో ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన ఈమె ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మధ్యే తెలుగు లో సమంతా నటించిన “యు టర్న్” మాతృక బాష కన్నడలో ఈమె హీరోయిన్ గా నటించింది.అలాగే ఈమె తమిళంలో సూపర్ హిట్ అయిన ‘విక్రమ్ వేద’ సినిమాలో కూడా నటించింది. ఇప్పుడేమో తెలుగులోకి “జెర్సీ” సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఎస్.నాగ వంశీ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

First Published:  12 Oct 2018 6:40 AM GMT
Next Story