Telugu Global
Cinema & Entertainment

దర్శకుడిగా మారిన మరో నటుడు

తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన “ఈ నగరానికి ఏమైంది” ఈ ఏడాది రిలీజ్ అయ్యి మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో నలుగురు కొత్త నటులు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. వారిలో విశ్వక్ సేన్ ఒకడు. విశ్వక్ సేన్ ఆల్రెడీ “వేల్లిపోమాకే” సినిమాతో హీరోగా పరిచయమై అయ్యి “ఈ నగరానికి ఏమైంది” ద్వారా తన నటన పరంపరాని కొనసాగించాడు. అయితే ఇప్పుడు  ఈ నటుడు దర్శకుడిగా మారాడు. మలయాళం లో సూపర్ హిట్ అయిన […]

దర్శకుడిగా మారిన మరో నటుడు
X

తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన “ఈ నగరానికి ఏమైంది” ఈ ఏడాది రిలీజ్ అయ్యి మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో నలుగురు కొత్త నటులు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. వారిలో విశ్వక్ సేన్ ఒకడు. విశ్వక్ సేన్ ఆల్రెడీ “వేల్లిపోమాకే” సినిమాతో హీరోగా పరిచయమై అయ్యి “ఈ నగరానికి ఏమైంది” ద్వారా తన నటన పరంపరాని కొనసాగించాడు. అయితే ఇప్పుడు ఈ నటుడు దర్శకుడిగా మారాడు.

మలయాళం లో సూపర్ హిట్ అయిన “అంగమలై డైరీస్” అనే సినిమాని తెలుగు లో రీమేక్ చేసి డైరెక్ట్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. “ఫలక్ నామ దాస్” అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా పూర్తీ చేసి ఈ ఏడాది చివరికల్ల సినిమాని రిలీజ్ చేసే పనిలో విశ్వక్ సేన్ ఉంటాడు. పూర్తీ స్థాయి పాత బస్తి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మాస్ కి నచ్చే విధంగా ఉంటుంది అని విశ్వక్ సేన్ భావిస్తున్నాడు.

First Published:  13 Oct 2018 2:11 AM GMT
Next Story