Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్

“సాహో” సినిమా షూటింగ్ పూర్తీ కాకముందే ప్రభాస్ రాధా కృష్ణ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ ఇటలిలో జరుగుంది. అక్కడ హీరోయిన్ పూజ హెగ్డే అలాగే ప్రభాస్ ల పై కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ని షూట్ చేస్తున్నాడు దర్శకుడు. అక్కడ షూటింగు జరుగుతుండగానే, హైదారాబాద్ లో తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. తదుప‌రి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. అందుకోసం 7 కోట్ల ఖర్చుతో […]

ప్రభాస్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్
X

“సాహో” సినిమా షూటింగ్ పూర్తీ కాకముందే ప్రభాస్ రాధా కృష్ణ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ ఇటలిలో జరుగుంది. అక్కడ హీరోయిన్ పూజ హెగ్డే అలాగే ప్రభాస్ ల పై కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ని షూట్ చేస్తున్నాడు దర్శకుడు. అక్కడ షూటింగు జరుగుతుండగానే, హైదారాబాద్ లో తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. తదుప‌రి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. అందుకోసం 7 కోట్ల ఖర్చుతో ఇక్కడ భారీ సెట్ వేస్తున్నారట.

సినిమాలో వచ్చే కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ఈ సెట్లో జరుగుతుందని చెబుతున్నారు. ఈ సెట్ లోనే ఒక షెడ్యూల్ మొత్తం షూట్ చేయనున్నారు మూవీ యూనిట్. ఈ సినిమాకి మొదట “అమౌర్” అనే టైటిల్ అనుకున్నా గాని తరువాత “జాన్” అనే టైటిల్ కి మొగ్గు చూపారు అంట మూవీ యూనిట్. కృష్ణంరాజు సొంతబ్యానర్ అయిన గోపీకృష్ణ మూవీస్ లో ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంది. అలాగే యువి క్రియేషన్స్ వారు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యి ఉన్నారు. పూర్తీ స్థాయి ప్రేమ కధ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

First Published:  13 Oct 2018 6:13 AM GMT
Next Story