Telugu Global
Cinema & Entertainment

దొంగగా ఎన్టీఆర్, పోలీస్ గా రామ్ చరణ్ ?

“బాహుబలి” లాంటి సినిమా తరువాత ఎస్.ఎస్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని హీరోలుగా పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ ని తెరకేకిస్తున్నాడు. ఈ సినిమాకి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే శర వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా దొంగ పోలీస్ కథగా తెరకెక్కనుంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ నేపధ్యంలో ఒక అధ్బుతమైన కథని రూపొందించినట్టు తెలుస్తుంది. దొంగగా ఎన్టీఆర్ నటిస్తే, పోలీస్ గా […]

దొంగగా ఎన్టీఆర్, పోలీస్ గా రామ్ చరణ్ ?
X

“బాహుబలి” లాంటి సినిమా తరువాత ఎస్.ఎస్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని హీరోలుగా పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ ని తెరకేకిస్తున్నాడు. ఈ సినిమాకి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే శర వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా దొంగ పోలీస్ కథగా తెరకెక్కనుంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ నేపధ్యంలో ఒక అధ్బుతమైన కథని రూపొందించినట్టు తెలుస్తుంది.

దొంగగా ఎన్టీఆర్ నటిస్తే, పోలీస్ గా రామ్ చరణ్ నటించే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఈ న్యూస్ బయటకి వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పై అంచనాల్ని ఒక రేంజ్ లో పెంచేసుకున్నారు అభిమానులు. అలాగే ఈ సినిమా సగం మొత్తం వర్షంలోనే ఉండేలాగా ప్లాన్ చేసాడు రాజమౌళి. అతి త్వరలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సినిమాకి సంభందించిన వర్క్ షాప్ లో పాల్గొంటారు అని తెలిసింది.

డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పై డి.వి.వి దానయ్య ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తుంది.

First Published:  13 Oct 2018 5:42 AM GMT
Next Story