Telugu Global
National

తమిళనాడు ముఖ్యమంత్రి పై సిబీఐ విచారణ

తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి పై సిబీఐ విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది. తమిళనాడులో 3,500 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పనులను ముఖ్యమంత్రి పళని స్వామి తన బినామీలకు, బంధువులకు అప్పగించారని, ఈ కాంట్రాక్టు పనుల్లో చాలా అవినీతి చోటుచేసుకున్నదని హైకోర్టులో డిఎంకే నేత ఒకరు పిటిషన్‌ వేశారు. దాన్ని స్వీకరించిన న్యాయస్థానం ఈ అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ అంటీ కరప్షన్‌ సంస్థను ఆదేశించింది. అయితే ఆ సంస్థ […]

తమిళనాడు ముఖ్యమంత్రి పై సిబీఐ విచారణ
X

తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి పై సిబీఐ విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

తమిళనాడులో 3,500 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పనులను ముఖ్యమంత్రి పళని స్వామి తన బినామీలకు, బంధువులకు అప్పగించారని, ఈ కాంట్రాక్టు పనుల్లో చాలా అవినీతి చోటుచేసుకున్నదని హైకోర్టులో డిఎంకే నేత ఒకరు పిటిషన్‌ వేశారు. దాన్ని స్వీకరించిన న్యాయస్థానం ఈ అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ అంటీ కరప్షన్‌ సంస్థను ఆదేశించింది.

అయితే ఆ సంస్థ దర్యాప్తు ముఖ్యమంత్రికి అనుకూలంగా నడుస్తోందని పిటిషనర్‌ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. దాంతో తాజాగా సిబీఐ విచారణకు ఆదేశించింది. ప్రాధమిక విచారణ నివేదికను మూడు నెలలలోగా అందజేయాలని సిబీఐని కోరింది.

First Published:  12 Oct 2018 11:50 PM GMT
Next Story