Telugu Global
Cinema & Entertainment

"సాహో" టిజర్ కి సంగీతం అందిస్తున్న తమన్

ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం లో స్టార్ ఎవరు అని అడిగితే అందరూ టక్కున ఎస్.ఎస్. తమన్ పేరే చెప్తారు. ఎందుకంటే ఈ మధ్య రిలీజ్ అయిన అన్నీ మూవీస్ కి తమన్ ఇచ్చిన స్కోరింగ్ సినిమా సక్సెస్ లో ఒక భాగంగా నిలిచింది. ఇటివలే రిలీజ్ అయిన “అరవింద సమేత” లో తమన్ ఇచ్చిన స్కోరింగ్ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే ఊపు తమన్ కి […]

సాహో టిజర్ కి సంగీతం అందిస్తున్న తమన్
X

ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం లో స్టార్ ఎవరు అని అడిగితే అందరూ టక్కున ఎస్.ఎస్. తమన్ పేరే చెప్తారు. ఎందుకంటే ఈ మధ్య రిలీజ్ అయిన అన్నీ మూవీస్ కి తమన్ ఇచ్చిన స్కోరింగ్ సినిమా సక్సెస్ లో ఒక భాగంగా నిలిచింది. ఇటివలే రిలీజ్ అయిన “అరవింద సమేత” లో తమన్ ఇచ్చిన స్కోరింగ్ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే ఊపు తమన్ కి ఇంకో బంపర్ ఆఫర్ వచ్చింది.

అదే “సాహో” సినిమా. అవును “సాహో” సినిమాకి తమన్ ని టీజర్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వమని అడుగుతున్నారు అంట మేకర్స్. అక్టోబర్ 23 వ తేదిన ప్రభాస్ పుట్టిన రోజు సంధర్బంగా ఈ టిజర్ రిలీజ్ కానుంది. ఒక్కసారి టిజర్ కట్ రెడీ అవ్వగానే తమన్ సినిమాకి సంభందించిన తన పని స్టార్ట్ చేస్తాడు.

సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ సంగీత దర్శకులు శంకర్ ఎసాన్ లాయ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

First Published:  13 Oct 2018 5:02 AM GMT
Next Story