Telugu Global
Cinema & Entertainment

విక్రమ్ కుమార్ ను సైడ్ చేసిన త్రివిక్రమ్

అరవింద సమేత హిట్ అయింది, విక్రమ్ కుమార్ సైడ్ అయిపోయాడు. నిజానికి ఈ సినిమాకు, విక్రమ్ కుమార్ కు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. కానీ అరవింద సమేత హిట్ అవ్వడం వల్లనే బన్నీతో సినిమా చేసే ఛాన్స్ మిస్ అయ్యాడు విక్రమ్ కుమార్. అవును, మొన్నటివరకు అరవింద సమేత రిజల్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేసిన అల్లు అర్జున్, ఇప్పుడా సినిమా సక్సెస్ అవ్వడంతో మరోసారి త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి […]

విక్రమ్ కుమార్ ను సైడ్ చేసిన త్రివిక్రమ్
X

అరవింద సమేత హిట్ అయింది, విక్రమ్ కుమార్ సైడ్ అయిపోయాడు. నిజానికి ఈ సినిమాకు, విక్రమ్ కుమార్ కు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. కానీ అరవింద సమేత హిట్ అవ్వడం వల్లనే బన్నీతో సినిమా చేసే ఛాన్స్ మిస్ అయ్యాడు విక్రమ్ కుమార్.

అవును, మొన్నటివరకు అరవింద సమేత రిజల్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేసిన అల్లు అర్జున్, ఇప్పుడా సినిమా సక్సెస్ అవ్వడంతో మరోసారి త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో విక్రమ్ కుమార్ తో చేయాల్సిన సినిమాను మరోసారి వాయిదావేశాడు.

గతంలో త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలొచ్చాయి. ఆ రెండూ హిట్ అయ్యాయి. రీసెంట్ గా బన్నీకి నా పేరు సూర్య సినిమాతో ఫ్లాప్ వచ్చింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేశాడు. అరవింద సమేత హిట్ అయితే త్రివిక్రమ్ తో సినిమా చేద్దామని, ఫ్లాప్ అయితే విక్రమ్ కుమార్ తోనే కంటిన్యూ అవుదామని బన్నీ ఆలోచించాడు. ఇప్పుడు అరవింద సమేత హిట్ అయింది కాబట్టి ఆటోమేటిగ్గా విక్రమ్ కుమార్ సైడ్ అయిపోయాడు.

పాపం.. విక్రమ్ కుమార్ బన్నీ కోసం దాదాపు స్క్రీన్ ప్లే మొత్తం పూర్తిచేశాడు. సెకెండాఫ్ లో కొన్ని మార్పుచేర్పులు చేస్తే సినిమా ఓకే అయిపోతుంది. ఈలోగా త్రివిక్రమ్ వచ్చి చేరాడు.

First Published:  13 Oct 2018 7:40 AM GMT
Next Story