Telugu Global
NEWS

 ఉసేన్ బోల్ట్... మారో గోల్...!

పరుగులో అలా… ఫుట్ బాల్ లో ఇలా…. ప్రపంచ 100, 200మీటర్ల పరుగులో దశాబ్దకాలం పాటు మెరుపులు మెరిపించిన జమైకన్ బుల్లెట్ ఉసేన్ బోల్ట్…. ప్రొఫెషనల్ ఫుట్ బాల్ లో సైతం రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా సెంట్రల్ కోస్ట్ మెరైనర్స్ జట్టు లో సభ్యుడిగా…సిడ్నీ వేదికగా మెకార్ధర్ సౌత్ వెస్ట్ యునైటెడ్ క్లబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బోల్ట్ తన తొలి ప్రొఫెషనల్ గోల్ సాధించాడు. 32 ఏళ్ల బోల్ట్…ఆట 55వ నిముషంలో… మెరుపు వేగంతో గోల్ కొట్టి… […]

 ఉసేన్ బోల్ట్... మారో గోల్...!
X
  • పరుగులో అలా… ఫుట్ బాల్ లో ఇలా….

ప్రపంచ 100, 200మీటర్ల పరుగులో దశాబ్దకాలం పాటు మెరుపులు మెరిపించిన జమైకన్ బుల్లెట్ ఉసేన్ బోల్ట్…. ప్రొఫెషనల్ ఫుట్ బాల్ లో సైతం రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా సెంట్రల్ కోస్ట్ మెరైనర్స్ జట్టు లో సభ్యుడిగా…సిడ్నీ వేదికగా మెకార్ధర్ సౌత్ వెస్ట్ యునైటెడ్ క్లబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బోల్ట్ తన తొలి ప్రొఫెషనల్ గోల్ సాధించాడు.

32 ఏళ్ల బోల్ట్…ఆట 55వ నిముషంలో… మెరుపు వేగంతో గోల్ కొట్టి… తనదైన స్టయిల్లో సెలబ్రేట్ చేసుకొన్నాడు. ఆట 69వ నిముషంలో బోల్ట్ తన రెండో గోల్ సాధించడం ద్వారా వారేవ్వా అనిపించుకొన్నాడు.

ఆస్ట్రేలియాలోని ఏ- లీగ్ క్లబ్ లో గత కొద్ది మాసాలుగా ట్రయిల్ రన్ లో ఉన్న బోల్ట్… శాశ్వత కాంట్రాక్టు కోసం ఎదురుచూస్తున్నాడు.

వరుసగా మూడు ఒలింపిక్స్ లో బంగారు పతకాలు సాధించిన తిరుగులేని రన్నర్ గా గుర్తింపు తెచ్చుకొన్న బోల్ట్…రియో ఒలింపిక్స్ తో ట్రాక్ అండ్ ఫీల్డ్ కు గుడ్ బై చెప్పి… ప్రొఫెషనల్ ఫుట్ బాల్ లో అడుగుపెట్టాడు. ఫుట్ బాలర్ గా గుర్తింపు తెచ్చుకోడానికి కఠోర సాధన చేస్తున్నాడు.

ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన సమయంలో…బోల్ట్ హావభావాలు…..ఫుట్ బాల్ లో గోల్ సాధించిన సమయంలోని హావభావాలు ఒకే తీరుగా ఉండటం విశేషం.

First Published:  13 Oct 2018 4:25 AM GMT
Next Story