Telugu Global
Cinema & Entertainment

3 రోజుల్లో 100 కోట్ల గ్రాస్

అరవింద సమేత సినిమాకు సంబంధించి మేకర్స్ కొత్తగా మరో ప్రచారం మొదలుపెట్టారు. విడుదలైన 3 రోజుల్లో ఈ సినిమాకు 100 కోట్ల గ్రాస్ వచ్చినట్టు ప్రకటించుకున్నారు. అంతేకాదు, 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల పోస్టర్లను బ్యాక్ డ్రాప్ లో పెట్టి ఏకంగా థ్యాంక్స్ మీట్ పెట్టారు. మరోవైపు షేర్ వివరాల్ని మాత్రం వెల్లడించడానికి మేకర్స్ నిరాకరిస్తున్నారు. మొదటి రోజు 26 కోట్ల రూపాయల షేర్ వచ్చిందని మాత్రం ప్రకటించారు. ఇక అప్పట్నుంచి ట్రేడ్ వర్గాలు మాత్రమే షేర్ […]

3 రోజుల్లో 100 కోట్ల గ్రాస్
X

అరవింద సమేత సినిమాకు సంబంధించి మేకర్స్ కొత్తగా మరో ప్రచారం మొదలుపెట్టారు. విడుదలైన 3 రోజుల్లో ఈ సినిమాకు 100 కోట్ల గ్రాస్ వచ్చినట్టు ప్రకటించుకున్నారు. అంతేకాదు, 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల పోస్టర్లను బ్యాక్ డ్రాప్ లో పెట్టి ఏకంగా థ్యాంక్స్ మీట్ పెట్టారు.

మరోవైపు షేర్ వివరాల్ని మాత్రం వెల్లడించడానికి మేకర్స్ నిరాకరిస్తున్నారు. మొదటి రోజు 26 కోట్ల రూపాయల షేర్ వచ్చిందని మాత్రం ప్రకటించారు. ఇక అప్పట్నుంచి ట్రేడ్ వర్గాలు మాత్రమే షేర్ వివరాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు సెడన్ గా 100 కోట్ల గ్రాస్ అంటూ ప్రచారం స్టార్ట్ చేశారు.

అటు ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. తారక్ ఇలా తన సినిమాలతో 15 లక్షల డాలర్లు ఆర్జించడం వరుసగా ఇది నాలుగోసారి. ఇది కూడా ఓ రికార్డు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అరవింద సమేత షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 11.16 కోట్లు
సీడెడ్ – రూ. 9.13 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.77 కోట్లు
ఈస్ట్ – రూ. 3.64 కోట్లు
వెస్ట్ – రూ. 3 కోట్లు
గుంటూరు – రూ. 5.45 కోట్లు
కృష్ణా – రూ. 3 కోట్లు
నెల్లూరు – రూ. 1.55 కోట్లు

First Published:  14 Oct 2018 6:41 AM GMT
Next Story