Telugu Global
NEWS

లోకేష్ హామీ ఉత్తుత్తిగానే మిగిలిపోనుందా?

కర్నూలులో బుట్టా రేణుకను గెలిపించాలని ఆ మధ్య పిలుపునిచ్చాడు లోకేష్. అప్పట్లో అది సంచలనం అయ్యింది. టీడీపీ టికెట్లను లోకేష్ ఖరారు చేస్తున్నాడా? అనే సందేహాలను కలిగించింది ఆ పిలుపు. అయితే ఆ తర్వాత లోకేష్ సర్దుకున్నాడు. తను ఎక్కడికి వెళ్లినా సిట్టింగులను గెలిపించాలని పిలుపునిస్తూ ఉన్నానని అదే విధంగా బుట్టా రేణుకను గెలపించాలని అన్నానని చెప్పుకొచ్చాడు. తద్వారా బుట్టా సీటుకు తను హామీ కాదని స్పష్టం చేశాడు. ఆ తర్వాత కర్నూలు ఎంపీ సీటు విషయంలో […]

లోకేష్ హామీ ఉత్తుత్తిగానే మిగిలిపోనుందా?
X

కర్నూలులో బుట్టా రేణుకను గెలిపించాలని ఆ మధ్య పిలుపునిచ్చాడు లోకేష్. అప్పట్లో అది సంచలనం అయ్యింది. టీడీపీ టికెట్లను లోకేష్ ఖరారు చేస్తున్నాడా? అనే సందేహాలను కలిగించింది ఆ పిలుపు. అయితే ఆ తర్వాత లోకేష్ సర్దుకున్నాడు. తను ఎక్కడికి వెళ్లినా సిట్టింగులను గెలిపించాలని పిలుపునిస్తూ ఉన్నానని అదే విధంగా బుట్టా రేణుకను గెలపించాలని అన్నానని చెప్పుకొచ్చాడు. తద్వారా బుట్టా సీటుకు తను హామీ కాదని స్పష్టం చేశాడు.

ఆ తర్వాత కర్నూలు ఎంపీ సీటు విషయంలో టీడీపీ నుంచి ఎవరూ పెద్దగా పోటీకి రాలేదు. ఈ సీటు వైసీపీకి అనుకూలమైన సీటు కావడంతో ఎవరూ పోటీ పట్ల ఉత్సాహం చూపించడం లేదు. అయితే బుట్టా పోటీ చేస్తే వైసీపీకి ఈ సీటు పళ్ళెంలో పెట్టి అప్పిగించినట్టే అవుతుంది అనేది మాత్రం స్పష్టం అవుతోంది.

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగాడని తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఈ సీటును కాంగ్రెస్ కు ఇచ్చేయాలనేది చంద్రబాబు లెక్క. అలా కాని పక్షంలో ఇక్కడ బుట్టా రేణుకను కాదని.. వేరే అభ్యర్థిని బరిలోకి దించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడట. అందుకోసం కొంతమందిని పరిగణనలోకి తీసుకుంటున్నాడట టీడీపీ అధినేత.

ఇటీవల తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలేమో రేణుకకు కర్నూలు సీటు కన్ఫర్మ్ అని రాశాయి. అయితే బాబు మాత్రం వేరే వాళ్లను ఈ సీటు విషయంలో పరిగణనలోకి తీసుకుంటున్నాడట.

First Published:  14 Oct 2018 12:00 PM GMT
Next Story