Telugu Global
NEWS

ఇండో-చైనా సాకర్ మ్యాచ్ సూపర్ డ్రా

చైనాను అడ్డుకొన్న భారత గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ 21 సంవత్సరాల విరామం తర్వాత ఇండో-చైనా సాకర్ సమరం ఆసియా ఫుట్ బాల్ చరిత్రలో ఓ అరుదైన మ్యాచ్…హోరాహోరీ డ్రాగా ముగిసింది. చైనా వాణిజ్యనగరం షాంఘై సమీపంలోని షుజావో సిటీ  ఒలింపిక్ సెంటర్ స్టేడియం వేదికగా జరిగిన పోటీలో 76వ ర్యాంకర్ చైనా, 97వ ర్యాంకర్ భారత్ జట్ల పోటీ 0-0తో డ్రాగా ముగిసింది. 1997 తర్వాత ఈ రెండుజట్ల మధ్య జరిగిన ఈ పోటీ తొలి […]

ఇండో-చైనా సాకర్ మ్యాచ్ సూపర్ డ్రా
X
  • చైనాను అడ్డుకొన్న భారత గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్
  • 21 సంవత్సరాల విరామం తర్వాత ఇండో-చైనా సాకర్ సమరం

ఆసియా ఫుట్ బాల్ చరిత్రలో ఓ అరుదైన మ్యాచ్…హోరాహోరీ డ్రాగా ముగిసింది.

చైనా వాణిజ్యనగరం షాంఘై సమీపంలోని షుజావో సిటీ ఒలింపిక్ సెంటర్ స్టేడియం వేదికగా జరిగిన పోటీలో 76వ ర్యాంకర్ చైనా, 97వ ర్యాంకర్ భారత్ జట్ల పోటీ 0-0తో డ్రాగా ముగిసింది.

1997 తర్వాత ఈ రెండుజట్ల మధ్య జరిగిన ఈ పోటీ తొలి నిముషం నుంచే నువ్వానేనా అన్నట్లుగా సాగింది.

రెండుజట్లకూ పలుమార్లు గోల్స్ సాధించే అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాయి. భారత గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్… పెట్టని గోడలా ఉండి… చైనా దాడులను తిప్పికొట్టాడు.

పలుమార్లు గోల్స్ కాకుండా అడ్డుకొన్నాడు. ఈ మ్యాచ్ చూడటానికి భారీసంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. చైనాతో ఇప్పటి వరకూ 18 సార్లు తలపడిన భారత ఫుట్ బాల్ జట్టు…ఒక్కసారీ నెగ్గలేకపోయింది. అయితే…. 21 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత…. జరిగిన ఈమ్యాచ్ ను డ్రాగా ముగించగలిగింది.

ప్రపంచంలోనే జనాభాపరంగా మొదటి రెండు అతిపెద్ద దేశాలుగా ఉన్న చైనా, భారత్…. ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో మాత్రం ఎంతగానో వెనుకబడి ఉన్నాయి. కనీసం ఆసియా స్థాయిలోనూ అగ్రశ్రేణిజట్లు కాలేకపోయాయి.

First Published:  13 Oct 2018 7:47 PM GMT
Next Story