Telugu Global
NEWS

ఐటీ హిట్‌ లిస్ట్‌లో బ్యాగులు మోసిన ఏపీ మంత్రి

రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులతోనే ఉలిక్కిపడ్డ అమరావతి టీడీపీ పెద్దలు… ఇప్పుడు ఏకంగా సీఎం రమేష్‌ పైనే దాడులు జరుగుతుండడంతో హడలిపోతున్నారు. తుపాను ప్రాంతాల్లో పర్యటిస్తూనే… వాహనంలోకి ఎక్కగానే చంద్రబాబు ఐటీ దాడుల గురించే ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. రాజధానిలో భూవ్యవహారాలు, సాగునీటి ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించిన వారు, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు డబ్బు పంపిణీ చేసిన వారిని ఐటీ టార్గెట్ చేసుకున్నట్టు అమరావతికి అందుతున్న సమాచారం. దీంతో తదుపరి క్యూలో ఉన్న నేతలను టీడీపీ […]

ఐటీ హిట్‌ లిస్ట్‌లో బ్యాగులు మోసిన ఏపీ మంత్రి
X

రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులతోనే ఉలిక్కిపడ్డ అమరావతి టీడీపీ పెద్దలు… ఇప్పుడు ఏకంగా సీఎం రమేష్‌ పైనే దాడులు జరుగుతుండడంతో హడలిపోతున్నారు. తుపాను ప్రాంతాల్లో పర్యటిస్తూనే… వాహనంలోకి ఎక్కగానే చంద్రబాబు ఐటీ దాడుల గురించే ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారు.

రాజధానిలో భూవ్యవహారాలు, సాగునీటి ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించిన వారు, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు డబ్బు పంపిణీ చేసిన వారిని ఐటీ టార్గెట్ చేసుకున్నట్టు అమరావతికి అందుతున్న సమాచారం. దీంతో తదుపరి క్యూలో ఉన్న నేతలను టీడీపీ పెద్దలు అప్రమత్తం చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సమయంలో నిధుల పంపిణీ సీఎం రమేష్ ద్వారానే జరిగినట్టు చెబుతున్నారు.

సీఎం రమేష్‌ నుంచి డబ్బు తీసుకుని దాన్ని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అప్పగించడంలో అనంతపురం జిల్లాకు చెందిన ఒక మంత్రి కీలక పాత్ర పోషించారట. ఐటీ టార్గెట్‌లో ఈ అనంతపురం జిల్లా మంత్రి కూడా ఉన్నారట. వేల కోట్ల వ్యవహారాలు నీటిపారుదల శాఖలోనే జరిగిన నేపథ్యంలో మంత్రి దేవినేని ఉమా, రాజధాని భూముల్లో కీలకంగా వ్యవహరించిన పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాస్‌రావు, నారాయణలు ఐటీ జాబితాలో ఉన్నారని సమాచారం.

అయితే ఇప్పుడు ఐటీ దాడులు చేసినా దొరికే అవకాశం ఉండదని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐటీ దాడులపై ముందే సమాచారం ఉన్న నేపథ్యంలో అందరూ పకడ్బందీగా సర్దేసుకున్నారని చెబుతున్నారు.

First Published:  14 Oct 2018 12:02 AM GMT
Next Story