Telugu Global
Cinema & Entertainment

నా గురించే ఎందుకు..... వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? " తమన్

ఎస్.ఎస్. తమన్…. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఫుల్ బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. కానీ తమన్ ని గత కొంత కాలంగా కొంత మంది టార్గెట్ చేస్తూ వస్తున్నారు. హాలీవుడ్ అలాగే బాలీవుడ్ సినిమాల నుంచి సాంగ్స్ కాపీ కొడతాడు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తమన్ ఇప్పటి వరకు అరవైకి పైగా సినిమాలకి సంగీతం అందించాడు. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాలకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ రికార్డ్ సాధించాడు. అయితే ఇదంతా […]

నా గురించే ఎందుకు..... వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం లేదు?  తమన్
X

ఎస్.ఎస్. తమన్…. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఫుల్ బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. కానీ తమన్ ని గత కొంత కాలంగా కొంత మంది టార్గెట్ చేస్తూ వస్తున్నారు. హాలీవుడ్ అలాగే బాలీవుడ్ సినిమాల నుంచి సాంగ్స్ కాపీ కొడతాడు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తమన్ ఇప్పటి వరకు అరవైకి పైగా సినిమాలకి సంగీతం అందించాడు. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాలకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ రికార్డ్ సాధించాడు. అయితే ఇదంతా కేవలం కాపీ ట్యూన్స్ ఇవ్వడం వల్లే సాధ్యపడింది అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఈ కామెంట్స్ పై తమన్ మీడియాతో మాట్లాడుతూ వారికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. సింపుల్ గా చెప్పాలి అంటే నన్ను తక్కువ అంచనా వేసి మాట్లాడే వారి గురించి నేను అస్సలు మాట్లాడను అని చెప్పేశాడు. అదే విధంగా నేను కాపీ ట్యూన్స్ ఇస్తున్నాను అని ధైర్యంగా చెప్పగలుతున్నారు…. మరి అంతే ధైర్యంగా ఎం.ఎం కీరవాణి, ఏ.ఆర్.రెహమాన్ గురించి ఎందుకు మాట్లాడరు? అని వారిపై నిప్పులు చెరిగాడు ఎస్.ఎస్. తమన్.

First Published:  13 Oct 2018 11:37 PM GMT
Next Story