Telugu Global
Cinema & Entertainment

సెలబ్రేషన్స్ కి దూరంగా ఫ్యామిలీ తో ట్రిప్ కి రెడీ అయిన ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా “అరవింద సమేత”. పూర్తీ స్థాయి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ చనిపోయాడు. ఇక ఇప్పుడు తండ్రి మరణం నుండి తేరుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ కొన్ని రోజుల పాటు విదేశాలకు వెళ్లబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇక్కడ సక్సెస్ ని […]

సెలబ్రేషన్స్ కి దూరంగా ఫ్యామిలీ తో ట్రిప్ కి రెడీ అయిన ఎన్టీఆర్
X

జూనియర్ ఎన్టీఆర్ హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా “అరవింద సమేత”. పూర్తీ స్థాయి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ చనిపోయాడు.

ఇక ఇప్పుడు తండ్రి మరణం నుండి తేరుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ కొన్ని రోజుల పాటు విదేశాలకు వెళ్లబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇక్కడ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోకుండా ఫ్యామిలీ తో కలిసి ట్రిప్ కి వెళ్తున్నాడు ఎన్టీఆర్.

విదేశాల నుండి తిరిగి వచ్చిన వెంటనే రామౌళి మల్టీస్టారర్ సినిమా కోసం ఎన్టీఆర్ డేట్లు కేటాయించబోతున్నాడు. డిసెంబర్ నుండి జక్కన్న మల్టీస్టారర్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో మరో హీరో గా నటిస్తున్నాడు.

First Published:  14 Oct 2018 2:00 AM GMT
Next Story