Telugu Global
NEWS

పవన్‌కు కమ్యూనిస్ట్ లీడర్ వెన్నుపోటు.... రాత్రి బాబుతో బేరాలు?

చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడు అని పదేపదే విమర్శించే కమ్యూనిస్టులు అసలు విషయం వచ్చే సరికి టీడీపీతో స్నేహానికి ఏమాత్రం వెనుకాడరన్న విమర్శ ఉంది. చంద్రబాబు కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకం అయినప్పటికీ కొందరు కమ్యూనిస్టు నేతలను కట్టిపడేయంలో మాత్రం ఆయనకు ఆయనే సాటి అని చెబుతుంటున్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఈ తరహా కమ్యూనిస్టు ఒకరు ఇబ్బందిగా మారారు. కొంతకాలంగా ఏపీలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జనసేనతో కలిసి పనిచేస్తున్నాయి. ఆ రెండు కమ్యూనిస్టు […]

పవన్‌కు కమ్యూనిస్ట్ లీడర్ వెన్నుపోటు.... రాత్రి బాబుతో బేరాలు?
X

చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడు అని పదేపదే విమర్శించే కమ్యూనిస్టులు అసలు విషయం వచ్చే సరికి టీడీపీతో స్నేహానికి ఏమాత్రం వెనుకాడరన్న విమర్శ ఉంది. చంద్రబాబు కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకం అయినప్పటికీ కొందరు కమ్యూనిస్టు నేతలను కట్టిపడేయంలో మాత్రం ఆయనకు ఆయనే సాటి అని చెబుతుంటున్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఈ తరహా కమ్యూనిస్టు ఒకరు ఇబ్బందిగా మారారు.

కొంతకాలంగా ఏపీలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జనసేనతో కలిసి పనిచేస్తున్నాయి. ఆ రెండు కమ్యూనిస్టు పార్టీల్లో ఒక కమ్యూనిస్టు నాయకుడు చంద్రబాబుకు కోవర్ట్‌గా పనిచేస్తున్నారని పవన్‌ కల్యాణ్ అనుమానిస్తున్నారు. మీడియా ముందు పవన్‌ కల్యాణ్‌పై ఈగ వాలినా తాము సహించం అన్నట్టు మాట్లాడే సదరు కమ్యూనిస్టు నేత లోలోన మాత్రం చంద్రబాబుకు సమాచారం చేరవేస్తున్నారని పవన్‌ కల్యాణ్‌కు ఇటీవల పక్కా సమాచారం అందినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

పగలు పవన్‌ వద్ద తిరిగే సదరు కమ్యూనిస్టు నాయకుడు రాత్రికి చంద్రబాబుకు టచ్‌లోకి వెళ్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లోని కొందరు పవన్‌ సానుభూతిపరులు జనసేనానికి విషయం చేరవేశారు. మీ మీద విపరీతమైన ప్రేమను ఒలకబోస్తున్న కమ్యూనిస్టు నేతే … ఎప్పటికప్పుడు చంద్రబాబుకు జనసేన విషయాలను చేరవేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాల్సిందిగా పవన్‌ను వారు హెచ్చరించారు.

కలిసి ఉద్యమం చేద్దామని జనసేనను పురమాయించడం, అందుకు జనసేన ఫాలో అయ్యే వ్యూహాన్ని వెంటనే చంద్రబాబుకు చేరవేయడం వంటివి సదరు కమ్యూనిస్టు నేత చేస్తున్నట్టు జనసేనాని పక్కా సమాచారంతోనే ఒక నిర్దారణకు వచ్చారు. ఇంతలోనే సదరు కోవర్టు కమ్యూనిస్టుకు చెందిన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌- టీడీపీ కూటమితో పొత్తు కుదుర్చుకోవడంతో పవన్‌ కల్యాణ్‌ కంగుతిన్నారని చెబుతున్నారు.

ఏపీలో చంద్రబాబులాంటి దుర్మార్గుడు లేడని తన వద్ద చెప్పే సదరు కమ్యూనిస్టు పార్టీ మరి తెలంగాణలో ఎలా చేతులు కలిపిందని పవన్‌ షాక్‌కు గురి అయ్యారని చెబుతున్నారు. 30 లక్షల మంది జీవితాలకు సంబంధించిన అగ్రిగోల్డ్ బాధితుల ఉద్యమం నీరు గారిపోవడం వెనుక సదరు కమ్యూనిస్టు నేతే కీలక పాత్ర పోషించారని చాలా కాలంగా ఆరోపణ ఉంది. ఈ విషయాన్ని కూడా ఇటీవల పవన్‌ కల్యాణ్ నిర్ధారించుకున్నారు.

అగ్రిగోల్డ్ భూములను ప్రభుత్వ పెద్దలు మింగేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని నడుపుదామంటూ ఎంటర్‌ అయిన సదరు కమ్యూనిస్టు నాయకుడు తీరా ఉద్యమాన్ని చంద్రబాబుకు అనుకూలంగా దెబ్బతీశారని ఆరోపణ ఉంది. తెలంగాణలో టీడీపీతో పొత్తు, అగ్రిగోల్డ్ ఉద్యమాన్ని దెబ్బతీసిన వైనం తెలుసుకున్న తర్వాత సదరు కమ్యూనిస్టు నేతపై జనసేన అనుమానపు చూపులు చూస్తోంది. అయితే ఇప్పటికీ సదరు కమ్యూనిస్టు నేత ఏమాత్రం సంకోచం లేకుండా పవన్‌ కల్యాణ్‌పై ఈగ వాలినా మీడియా ముందుకు వచ్చి ఖండిస్తుండడం చూసి జనసేన నేతలే ఆశ్చర్యపోతున్నారు.

First Published:  13 Oct 2018 11:15 PM GMT
Next Story