Telugu Global
Cinema & Entertainment

రాజమౌళి సెంటిమెంట్ ను ప్రభాస్ బ్రేక్ చేస్తాడా?

“బాహుబలి” లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ ఏ స్టార్ డైరెక్టర్ తోనో  సినిమా చేస్తాడు అని అనుకున్నారు అంతా. కానీ ప్రభాస్ మాత్రం కొత్త దర్శకుడు సుజీత్ ని ఎంకరేజ్ చేస్తూ “సాహో” సినిమా స్టార్ట్ చేశాడు. ఇది ఒక రకంగా ప్రయోగమనే చెప్పాలి. ఎందుకంటే సుజిత్ కేవలం ఒక్క సినిమా మాత్రమే డైరెక్ట్ చేసాడు. సరే ఆ సినిమాని పక్కన పెడితే మళ్ళీ రెండో సినిమా కూడా “జిల్” వంటి ఫ్లాప్ చిత్రానికి […]

రాజమౌళి సెంటిమెంట్ ను  ప్రభాస్ బ్రేక్ చేస్తాడా?
X

“బాహుబలి” లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ ఏ స్టార్ డైరెక్టర్ తోనో సినిమా చేస్తాడు అని అనుకున్నారు అంతా. కానీ ప్రభాస్ మాత్రం కొత్త దర్శకుడు సుజీత్ ని ఎంకరేజ్ చేస్తూ “సాహో” సినిమా స్టార్ట్ చేశాడు. ఇది ఒక రకంగా ప్రయోగమనే చెప్పాలి.

ఎందుకంటే సుజిత్ కేవలం ఒక్క సినిమా మాత్రమే డైరెక్ట్ చేసాడు. సరే ఆ సినిమాని పక్కన పెడితే మళ్ళీ రెండో సినిమా కూడా “జిల్” వంటి ఫ్లాప్ చిత్రానికి దర్శకత్వం వహించిన రాధాకృష్ణ దర్శకత్వంలో “జాన్” అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్.

”బాహుబలి” “బాహుబలి 2” చిత్రాల ద్వారా ప్రభాస్ స్టార్ డమ్ పెరిగింది. అయితే ఆ చిత్రాల తర్వాత ప్రభాస్ మళ్ళీ అగ్ర దర్శకులతో సినిమాలు చేయాల్సింది పోయి ప్రయోగాలు చేస్తున్నాడని… అది బెడిసి కొడితే రాజమౌళి సెంటిమెంట్ ని నిజం చేసిన వాడు అవుతాడని భయపడుతున్నారట ప్రభాస్ ఫ్యాన్స్.

ఇంతకీ రాజమౌళి కి ఉన్న సెంటిమెంట్ ఏంటంటే…. రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోకు ఇమేజ్ వస్తుంది కానీ ఆ సినిమా తర్వాత కోలుకోవాలంటే ఆ హీరోకు చాలా కాలం పడుతుంది. ఇప్పటివరకు రాజమౌళి తో సినిమా చేసిన తరువాత ఏ హీరో మళ్ళీ ఆ రేంజ్ లో హిట్టు కొట్టలేదు. ఈ రకంగా చూసుకుంటే ప్రభాస్ పెద్ద రిస్కే చేస్తున్నాడు అని కొందరంటున్నారు. గతంలో ప్రభాస్ కు ఛత్రపతి సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఛత్రపతి సినిమా తరువాత చాలా రోజులకు గానీ హిట్ లు అందుకోలేక పోయాడు. చూడాలి ఈసారైనా ప్రభాస్ రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడో లేదో…!

First Published:  14 Oct 2018 1:48 AM GMT
Next Story