Telugu Global
Cinema & Entertainment

వర్మకు దొరికిన చంద్రబాబు అసలు కథ ఇది

అచ్చం చంద్రబాబుని పోలిన ఓ వ్యక్తి వీడియో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి ఆచూకీ తెలుసుకోవాలని ప్రయత్నించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆ దిశగా సక్సెస్ అయ్యాడు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్  ద్వారా చంద్రబాబు లాంటి వ్యక్తి ఆచూకీని తెలుసుకున్నాడు. కానీ అతడి వివరాల్ని మాత్రం వర్మ బయటపెట్టలేదు. అయితే సోషల్ మీడియాలో ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు కొన్ని బయటకొచ్చాయి. వీడియోలో […]

వర్మకు దొరికిన చంద్రబాబు అసలు కథ ఇది
X

అచ్చం చంద్రబాబుని పోలిన ఓ వ్యక్తి వీడియో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి ఆచూకీ తెలుసుకోవాలని ప్రయత్నించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆ దిశగా సక్సెస్ అయ్యాడు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ ద్వారా చంద్రబాబు లాంటి వ్యక్తి ఆచూకీని తెలుసుకున్నాడు. కానీ అతడి వివరాల్ని మాత్రం వర్మ బయటపెట్టలేదు.

అయితే సోషల్ మీడియాలో ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు కొన్ని బయటకొచ్చాయి. వీడియోలో అతడు హోటల్ కు వచ్చిన వ్యక్తులకు భోజనం వడ్డిస్తున్నాడు. ఆ హోటల్ అతనిదే. అది త్రయంబకేశ్వర్ లో ఉంది. అతడ్ని కొంతమంది ప్రభు అని, మరికొంతమంది భూషణ్ అని పిలుస్తుంటారట.

అయితే చంద్రబాబును పోలిన ఆ వ్యక్తి ఇప్పుడు త్రయంబకేశ్వర్ లో లేడట. అక్కడి నుంచి ముంబయికి మకాం మార్చాడట. భూషణ్ ముంబయికి వెళ్లినప్పటికీ అతడి అడ్రెస్ మాత్రం రామ్ గోపాల్ వర్మ వద్ద ఉందట. కావాలనే ఈ విషయాల్ని వర్మ వెల్లడించలేదట. అతడ్ని కలిసి, అతడితో ఫొటో దిగి అప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టాలనేది వర్మ ప్లానట.

ప్రస్తుతం ఈ దర్శకుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ఎన్టీఆర్ బయోపిక్ తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో చంద్రబాబు పాత్ర కోసం ఈ భూషణ్ అనే వ్యక్తి కోసం ఆరా తీశాడు. త్వరలోనే అతడ్ని తెరపైకి తీసుకురాబోతున్నాడట వర్మ.

First Published:  14 Oct 2018 3:16 AM GMT
Next Story