Telugu Global
NEWS

ఉద్య‌మ నేత‌ల‌కు కాంగ్రెస్ వ‌ల ! అల‌ర్ట్ అయిన టీఆర్ఎస్ !

టీఆర్ఎస్‌లో కొత్త కుంప‌టి ర‌గిలే అవ‌కాశం క‌న్పిస్తోంది. టికెట్లు ద‌క్క‌ని నేత‌లు ప‌క్క పార్టీలోకి దూకేందుకు స్కెచ్‌లు రెడీ చేసుకున్నారు. 105 మంది లిస్ట్ వ‌చ్చింది. అక్క‌డ‌క్క‌డా అసంత‌ప్తులు రాజుకున్నాయి. కానీ వారిలో చాలా మంది ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కానీ వీరిలో నామినేష‌న్ల ప్ర‌క్రియ మొద‌లైతే ఎంత మంది రెబెల్స్‌గా మారుతారో తెలియ‌దు. మ‌రోవైపు 14 స్థానాలకు అభ్యర్ధులను ప్ర‌క‌టించని చోట కూడా అసంతృప్తి తీవ్ర‌స్థాయిలోనే ఉంది. ఇక్క‌డ కూడా కొంద‌రు నేత‌లు ప‌క్క పార్టీల‌తో […]

ఉద్య‌మ నేత‌ల‌కు కాంగ్రెస్ వ‌ల ! అల‌ర్ట్ అయిన టీఆర్ఎస్ !
X

టీఆర్ఎస్‌లో కొత్త కుంప‌టి ర‌గిలే అవ‌కాశం క‌న్పిస్తోంది. టికెట్లు ద‌క్క‌ని నేత‌లు ప‌క్క పార్టీలోకి దూకేందుకు స్కెచ్‌లు రెడీ చేసుకున్నారు. 105 మంది లిస్ట్ వ‌చ్చింది. అక్క‌డ‌క్క‌డా అసంత‌ప్తులు రాజుకున్నాయి. కానీ వారిలో చాలా మంది ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కానీ వీరిలో నామినేష‌న్ల ప్ర‌క్రియ మొద‌లైతే ఎంత మంది రెబెల్స్‌గా మారుతారో తెలియ‌దు.

మ‌రోవైపు 14 స్థానాలకు అభ్యర్ధులను ప్ర‌క‌టించని చోట కూడా అసంతృప్తి తీవ్ర‌స్థాయిలోనే ఉంది. ఇక్క‌డ కూడా కొంద‌రు నేత‌లు ప‌క్క పార్టీల‌తో ట‌చ్‌లోకి వెళ్లారు. ముఖ్యంగా రాజేంద్ర‌న‌గ‌ర్‌ సీటును ఆశించిన స్వామిగౌడ్ కాంగ్రెస్ నేత‌ల‌తో మంత‌నాలు జ‌రిపార‌ట‌. త‌నకు టికెట్ ఇస్తే పార్టీలోకి వ‌చ్చేందుకు సై అన్నార‌ట‌. ఈ విష‌యంలో ఉత్త‌మ్‌, జానారెడ్డి కూడా స్వామిగౌడ్‌కు హామీ ఇచ్చార‌ట‌. ఒక‌టి, రెండు రోజుల్లో ముహూర్తం చూసుకుని వ‌చ్చేయ్ అని వారు చెప్పార‌ట‌.

అయితే ఈ విష‌యం అప్ప‌టికే గులాబీ నేత‌ల‌కు తెలిసిపోయింది. దీంతోవారు స్వామిగౌడ్‌ను బుజ్జ‌గించారు. ఆయన పార్టీ మారే వ్య‌వ‌హారం ఆగిపోయింది. ఎమ్మెల్సీగా స్వామిగౌడ్ పదవీకాలం మార్చితో ముగిసిపోతోంది. ఆయ‌నకు రెన్యూవ‌ల్ ఉంటుందో లేదో తెలియ‌దు. ఇటు మండ‌లి ఛైర్మ‌న్‌గా సురేష్ రెడ్డికి చాన్స్ ఇస్తార‌ని హామీ ఇచ్చారు. దీంతో త‌న‌కు అవ‌కాశం రాద‌ని… రాజేంద్ర‌న‌గ‌ర్ సీటు నుంచి పోటీ చేయాల‌ని అయ‌న క‌ల‌లు క‌న్నారు. టికెట్ ఇస్తే కాంగ్రెస్‌లోకి వెళ్లాల‌ని అనుకున్నారు. కానీ క‌థ అడ్డం తిరిగింది.

సరిగ్గా ఇదే విష‌యం నాయిని న‌ర్సింహ్మ‌రెడ్డి విష‌యంలో జ‌రిగింది. ముషీరాబాద్ నుంచి త‌న అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇప్పించుకోవాల‌ని ఆయ‌న ప్లాన్ వేశారు. కానీ టికెట్ వ‌చ్చే దారులు క‌న‌బ‌డ‌డంలేదు. దీంతో కాంగ్రెస్ నేత‌ల ట‌చ్‌లోకి వెళ్లారు. ఈ విష‌యం తెలిసిన గులాబీ నేత‌లు… ఆయ‌నతో రాయ‌బారానికి వెళ్లారు. ఈ ఎపిసోడ్‌తో మెత్త‌బ‌డిన నాయిని… శ‌నివారం టీఆర్ఎస్ భ‌వ‌న్‌లో ప్రెస్‌మీట్ పెట్ట‌డం దాకా వెళ్లింది. ఇదే రూట్లో దానం నాగేంద‌ర్‌తో పాటు ప‌లువురు నేత‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రీ వారి సంగ‌తి రాబోయే రోజుల్లో తెలుస్తుంద‌ని గుస‌గుస‌లు విన్పిస్తున్నాయి.

First Published:  14 Oct 2018 4:02 AM GMT
Next Story